COLLOCATIONS - 1

COLLOCATIONS - 1

సామాన్యంగా ఎవర్నయినా మనం బాగా చదువుకున్నవాళ్లు/ ఉన్నత విద్యార్హతలు కలవాళ్లు అనేందుకు educated/qualified ముందు Highly అనే వాడతాం. greatly educated/much qualified అనం. educated/qualified కు ముందు అప్పుడప్పుడు well కూడా వాడ్తాం.
¤ పండగ సమయాల్లో దుకాణాలు మనను ఆకర్షించేందుకు Bumper offer/Attractive offer లు ఇస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో cheap/charming offer అనం. (charming = attractive అయినప్పటికీ)
¤  పొరపాటు చేయటం అనే అర్థంతో, make a mistake అనే అంటాం. Do a mistake/perform a mistake అనం. (commit a mistake సరికాదు)ఇలాంటి ఎప్పుడూ కలిసివచ్చే మాటల కలయికను COLLOCATION అంటాం. తెలుగులో కూడా... ఆ మాటకొస్తే ఏ భాషలోనైనా ఇలాంటి collocations ఉంటూనే ఉంటాయి.
Read the following dialogue aloud.
Pranav: What are you doing? (ఏం చేస్తున్నావు?)
Pramod: Nothing in particular. Just wandering what could be the secret of Ganesh's success. (ప్రత్యేకంగా ఏం లేదు, గణేష్ విజయ రహస్యమేమిటా అని ఆలోచిస్తున్నాను. వాడేం చేసినా విజయం వాడిదౌతుంది)
Pranav: Nothing like hard work. Hard work is the key to success. (కృషికి మించింది లేదు. కృషే విజయానికి తాళం చెవిలాంటిది)
Pramod: That's beyond doubt, of course. But do you mean I don't work hard? Whatever success I've achieved during this academic year is the fruits of my labours. (అది నిస్సందేహం. అయితే నేనంత కృషి చేయననా నువ్వనేది? ఈ విద్యాసంవత్సరంలో నేను సాధించిందంతా నా కృషి ఫలితమే)
Pranav: Who denies it? Don't take me amiss. In fact I congratulate you on the full marks you got in English (ఎవరు కాదంటారది? నన్నపార్థం చేస్కోకు. English లో నీకు వచ్చిన full marks కు నిన్ను నేనభినందిస్తున్నాను)
Pramod: Thank you.
Pranav: But what about the dinner you promised me. Time you fulfiled your promise, my dear (నువ్వు నాకు ఇస్తానన్న dinner మాటేమిటి? నీ మాట నిలబెట్టుకోవాల్సిన సమయం ఎప్పుడో దాటిపోయింది)
Pramod: Don't worry. It'll be this evening.(నువ్వేం బాధపడకు. ఇవాళ సాయంత్రం ఉంటుందది)
Pranav: Thank you.
Look at the following expressions from the conversation above.
1) Secret of/key to, success 
2) Meet with success 
3) Fruits of some one's labours. 
4) Take somebody amiss 
5) Full marks 
6) Fulfil promise         
పై expressions collocations (పద కలయిక)కు మంచి ఉదాహరణలు.         
1) Secret of success - విజయ రహస్యం
 2) Key to success - విజయానికి కీలకం
3) Meet with success - విజయం పొందటం
 4) Take amiss (అపార్థం)- అపార్థం చేస్కోవటం
5) full marks -పూర్తి ప్రతిఫలం
6) fulfil (నిలబెట్టుకోవటం/నెరవేర్చటం)/ promise
         చూశారా, పై మాటల కలయికలు! సామాన్యంగా ఈ success విషయంలో secret of (రహస్యం), Key (కీలకం) ఎప్పుడూ వాడుతుంటాం.         
Meet with success - విజయం పొందటం - ముఖ్యంగా ఎదురుచూడని విజయం కల్గినపుడు.
వేరే మాటలు వాడితే విచిత్రంగా....         
collocation లో వచ్చే మాటల కలయిక, ఆ మాటలు లేకపోతే తప్పని కాదు. కానీ వాడుకలో లేకపోవటంవల్ల, కొంత విచిత్రంగా అన్పిస్తుంది. 
ఉదాహరణకు- విషాదకర ప్రమాదాన్ని Tragic accident అనే అంటాం. కానీ, sad/sorrowful accident అనం. 
Tragic = sad/sorrowful అయినప్పటికీ, collocations మీద పట్టు సాధిస్తే మనం చెప్పాలనుకున్నదీ/ రాయాలనుకున్నదీ effective గా చెప్పగలం/ రాయగలం.
Choose the word/word group which collocates with the other words.
1. --- rain
A) Small          B) Heavy          C) Great          D) Strong
2. ---- an exam
A) Take          B) Write           C) Give          D) Attend for
3. Sleep ----
A) fully          B) totally          C) Restively          D) Soundly
4. Make ------
A) a lecture          B) a speech          C) an exam          D) a crime
5. A --- apartment
A) spacious          B) comfortable          C) homely          D) plain

1. Answer B: A heavy rain = Rain that drops a great quantity of water పెద్ద వాన. పెద్దవాన అని చెప్పటానికి, Heavy rain అనే అంటాం- big/great/strong rain అనటం సరికాదు.
2. Answer A: పరీక్ష రాయటం- దీనికి Englishలో take an exam అంటాం. అంతేకానీ 
B) write an exam సరికాదు, Indian English వాడకం. 
C) give an exam అసలు సరికాదు. 
D) Attend to an exam అనం, Attend an exam = పరీక్షకు హాజరవటం/ రాయటం అనటం correct. 
Attend to = ఏ విషయమైనా చూస్కోటం - 
He is attending to the arrangements = ఏర్పాట్ల విషయం అతను చూసుకుంటున్నాడు. 
Please attend to the guest = అతిథులను చూస్కో (వాళ్లక్కావలసిన విషయాలు చూడు).
3. Answer D : 
Sleep soundly = సుఖంగా/ అంతరాయం లేని నిద్ర. 
A) Sleep fully 
B) Sleep totally అని మామూలుగా అనరు. ఈ combinations వల్ల వచ్చే collocations సరికావు. 
C) Restively = ఉన్న పరిస్థితితో విసిగిపోయి మార్పుకోసం అసహనంతో తిరగబడే పరిస్థితిలో ఉన్న - 
a) The students are restive as the teacher doesn't teach well.
b) The people in the country are restive, as they are not happy with the present government = ప్రస్తుత ప్రభుత్వంతో తృప్తిపడని ప్రజలు మార్పుకోసం అసహనంగా ఉన్నారు.
4. Answer B : ఉపన్యసించటం/ ప్రసంగించటం. 
Give a speech/deliver a speech correct collocation కాదు. 
Deliver a lecture అని కూడా అంటాం. 
ఒక విషయం గురించి ఉపన్యాసం - Lecture. 
Make a lecture అనం.
C) Make an exam అసలు అనం.
D) Make a crime అనం, నేరం చేయటం అనే అర్థంతో commit a crime, correct collocation.
5. Answer A : An apartment with a lot of space - విశాలంగా ఉన్న apartment. దీనికి ఇంకో collocation spacious (విశాలంగా ఉన్న), airy(గాలి బాగా వచ్చే) and well ventilated (వెలుతురు బాగా ఉన్న). సామాన్యంగా దీనిని ఇళ్లకు, Hallsకూ, apartments కూ, class rooms కూ వాడతాం.
B) Comfortable = సుఖవంతమైన- ఇది సామాన్యంగా ఇంటి వసతులకు వాడరు.
C) Homely - ఇదసలు సరికాదు. అర్థం తెలుసు కదా- మన ఇంట్లో మనం పొందగల సౌఖ్యాలు, సౌకర్యాలతో కూడిన/ మనకు కొత్తగా అనిపించని ప్రదేశాన్ని గురించి ఇలా అంటాం.
D) Plain apartment - ఇలా అనటం సరికాదు- వాడుకలో లేదు.