Showing posts with label Collocations. Show all posts
Showing posts with label Collocations. Show all posts
COLLOCATIONS - 15
COLLOCATIONS - 15
కొన్ని పదాలు కొన్నిటితో కలిసివస్తేనే అర్థస్ఫూర్తి కలుగుతుంది. చెప్పదలిచిన భావం స్పష్టంగా, పదునుగా అవతలి వ్యక్తికి చేరుతుంది. ఏ పదం దేనితో collocate అవుతుందో గ్రహించి, వాటిని అదేవిధంగా వాడటం విద్యార్థుల భాషాజ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది.Ranjit: Why do you reject my proposal out of hand? Why don't you give some consideration to it? నా ప్రతిపాదనను ఏం ఆలోచించకుండానే ఎందుకు కాదంటావు? దానికెందుకు కాస్త పరిగణన ఇవ్వవు?
Balaji: Far from it. It's only after due consideration, I've come to the conclusion that your plan won't work. I suggest that you take a fresh look at it, and think of an alternative. అదేం లేదు. బాగా పరిశీలించిన తర్వాతనే నీ ప్రణాళిక పని చేయదనే నిర్ధారణకొచ్చాను. నా సూచనేంటంటే దాన్ని మరోసారి పరిశీలించి ప్రత్యామ్నాయం ఉంటుందేమో చూడు.
Ranjit: You'd better know that it is not just my plan. In fact the MD unveiled the plan in the board meeting last week. అది నా ప్రణాళిక అని మాత్రమే అనుకోకు దాన్ని నువ్వు. అసలది మన Managing Director గత వారం బోర్డు సమావేశంలో ఆవిష్కరించారు.
Balaji: And perhaps he asked you to drum up support for it, didn't he? Nothing escapes my notice. ఆయన నిన్ను దానికి మద్దతు కూడగట్టమని చెప్పాడు కదా? నా దృష్టి/ఆలోచన నుంచి ఏదీ తప్పించుకోలేదు.
Ranjit: Perhaps so. But still you take a second look at it, and let me know by tomorrow evening. The plan, in my opinion is the best in the circumstances. If by a stroke of luck the plan works, the company will make a huge fortune, and we will benefit too. అవచ్చు. మళ్లీ నువ్వది ఇంకోసారి ఆలోచించి రేపు సాయంత్రం నాకు చెప్పు. ప్రస్తుత పరిస్థితిలో ఇది అత్యుత్తమ పథకం. అదృష్టవశాత్తూ అది పనిచేసిందా కంపెనీకి బాగా లాభాలు వస్తాయి. మనమూ లాభపడ్తాం.
Balaji: If you can allow me to make slight alterations in the plan, I don't mind passing it. ఆ ప్రణాళికలో కొద్దిపాటి మార్పులకు అనుమతిస్తే దాన్ని ఆమోదించేందుకు అభ్యంతరం లేదు.
Now look at the following sentences from the dialogue above.
1) .... reject my proposal out of hand
2) ... take a fresh look at something a second look at something
3) ... drawn up support
1) Reject my proposal out of hand
Reject అంటే తెలుసు కదా? తోసిపుచ్చటం.
Reject a proposal out of hand= ఏమాత్రం ఆలోచించకుండా తోసి పుచ్చటం లేదా కొట్టిపారేయటం.
Rejectచాలామటుకు ' out of hand' తో collocateఅవుతుంటుంది.
a) Eswar: Tarun doesn't think at all. He thinks he alone is right. (తరుణ్ అసలు ఆలోచించడు. తనొక్కడే ఎప్పుడూ సరి అనుకుంటాడు.
Ganesh: What's happened now? (ఇప్పుడేం జరిగింది?)
Eswar: I proposed that we expand our business. He dismissed it out of hand(మన వ్యాపారం విస్తరిద్దామని ప్రతిపాదించాను. ఆలోచనా పాలోచనా లేకుండానే తిరస్కరించాడు.)
b) Gangadhar: How is Hemanth's condition now? (హేమంత్ పరిస్థితి ఎలా ఉంది?)
Hanuman: Getting worse by the day. I suggested Homeopathy. He refused it out of hand. (రోజురోజుకూ క్షీణిస్తోంది. నేను హోమియోమందు వాడమన్నాను. అసలేం ఆలోచించకుండా దాన్ని కాదన్నాడు.)
చూశాం కదా, out of hand, reject, dismiss, refuse తో collocateఅవుతుంది.
Don't reject anything out of hand. Think well before you do it. దేన్నీ అనాలోచితంగా తృణీకరించవద్దు. అది చేసేముందు బాగా ఆలోచించు.
2) Take a fresh look at something =దేన్నైనా కొత్తగా ఆలోచించటం.
fresh look=నూతన ఆలోచనాసరళి లేదా కొత్తగా ఆలోచించటం.
ఇది takeతో collocateఅవుతుంది.
a) Indeevar: I don't find any good in your advice (నీ సలహాలో నాకేం మంచి కన్పించడం లేదు)
Jairam: Then why ask for my advice? You take a fresh look at it and decide for yourself. (అలాంటప్పుడు నా సలహా ఎందుకడగటం? నువ్వే మరోసారి కొత్త కోణంలో ఆలోచించి నిర్ణయం తీస్కో)
b) Kiran: What has to be done to end corruption in India ? (భారత్‌లో అవినీతిని ఎలా అంతం చేయటం?)
Kesav: The whole problem demands our taking a fresh look at it.(ఆ సమస్యను మనం సమూలంగా కొత్త కోణం నుంచి ఆలోచించాలి)
Take, 'a second look' తో కూడా collocateఅవుతుంది.
Take a second look=Think again= పునరాలోచించడం
3) to drum up support = మద్దతు కూడగట్టడం, గట్టి ప్రయత్నంతో.
a) Lekhak: Though the leader is in jail, those joining his party are increasing day by day ( ఆ నాయకుడు జైల్లో ఉన్నప్పటికీ, అతని పార్టీలో చేరేవాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది)
Lavanya: He doesn't lack people to drum up support for him. (అతనికి మద్దతు కూడగట్టేవాళ్ల సంఖ్యకు కొదవలేదు)
b) Mohan: Why is Ganesh so close to Nikhil? (గణేష్‌ని, నిఖిల్‌తో అంత సన్నిహితంగా ఎందుకుంటాడు?)
Manoj: Because whatever Ganesh does, Nikhil drums up support for him. (గణేష్ ఏం చేసినా నిఖిల్ దానికి మద్దతు కూడగడ్తాడు)
COLLOCATIONS - 14
COLLOCATIONS - 14
Collocations లో Rush to some one's help, Lend a helping hand / lend a hand, Thoroughly mistaken మొదలైన వ్యక్తీరణలూ, వాటి ప్రయోగాలూ తెలుసుకుందాం!Sourabha: Hi Narmada, your colleague seems to have lent a helping hand in clearing the files. How nice of him!
(మీ సహోద్యోగి files పూర్తి చేయడంలో సాయపడినట్లున్నాడు. ఎంత మంచివాడో!)
Narmada: you are thoroughly mistaken. My colleague helping me? The help that I get from him is precious little. Luck doesn't favour me that way.( నువ్వు పూర్తిగా పొరబడ్డావు. నా సహోద్యోగి నాకు సాయపడ్డమా? అతడి దగ్గర నుంచి నాకు సాయం చాలా తక్కువ నాకా అదృష్టం లేదు.)
Sourabha: I don't face that kind of situation in our office. My colleagues rush to my help if I need it, and so do I when they need my help.
(అలాంటి పరిస్థితి నాకు మా ఆఫీస్‌లో లేదు. నా సహోద్యోగులు అవసరమైనప్పుడు నన్నాదుకునేందుకు సిద్ధపడతారు, నేనూ అంతే వాళ్లకు నా సాయం కావాల్సినప్పుడు.)
Narmada: How I envy you! I have to be on my own whenever a plan has to be implemented in our company. Even in emergencies none comes to my rescue- days were when I could not finish my work before 9 in the evening.( నువ్వంటే నాకు ఎంత ఈర్ష్యగా ఉందో! మా company లో ఏ పథకమైనా ఆచరణలో పెట్టాలంటే నాకు నేనే చేసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో కూడా నాకెవరూ సాయం చేయరు. రాత్రి 9 వరకూ పని పూర్తవని రోజులెన్నో.)
Sourabha: How could they be so uncooperative? Doesn't your boss do anything about it? (అంత సహాయం చేయకుండా ఎలా ఉంటారు వాళ్లు? మీ boss ఈ విషయంలో ఏం చేయలేరా?)
Narmada: All that he does is sympathise with me, and nothing else. He overlooks their faults as he is afraid of the union. They always have their grievances, and get them redressed, but there is none to attend to mine. I fight a lonely battle. I think I have to be put up with it till I get a transfer. Till then I think I have face the challenge.(ఆయన చేయగల్గిందల్లా నాకు సానుభూతి చూపడమే. యూనియన్ అంటే ఆయనకు భయం కాబట్టి వాళ్ళ తప్పులు ఆయన పట్టించుకోడు. వాళ్ల బాధలు వాళ్ళకెప్పుడూ ఉంటాయి. వాటిని వాళ్లు నివారింపజేసుకుంటారు. నా బాధలే పట్టించుకునే వాళ్లులేరు. బదిలీ వచ్చేదాక నేనీ బాధలు పడాల్సిందే. ఈ సవాలు నేనెదుర్కోవాల్సిందే.)
Look at the following expressions from the conversation above:
1) Lend a hand/ a helping hand = చేయూత ఇవ్వడం/ సాయపడటం
a) Santosh: I just can't find words to thank you enough. You have been great help really.
(నీకు తగినంత ధన్యవాదాలు తెలిపేందుకు నాకు మాటలు రావట్లేదు. నిజంగా ఎంతో సాయపడ్డావు.)
Pramod: Oh, not at all. It's my pleasure. Always willing to lend a hand
(అంతేం లేదులెండి. నా సంతోషంకోసం చేశా. సాయపడేందుకెప్పుడూ సిద్ధమే)
b) Yasas: Could you lend (me) a hand with this maths problem?
(ఈ లెక్క చేయడంలో నీకు సాయపడనా?)
Keerthi: That'd (That would) be a pleasure. Let me see.
(సంతోషంగా. ఏదీ చూడనీ)
2) Thoroughly mistaken
To be mistaken = To have a wrong idea = పొరపడటం.
Thoroughly = completely = పూర్తిగా.
Mistaken ఎప్పుడూ thoroughlyతో collocate అవుతుంది.
a) Lasith: I think with the passing of Anna's Lokpal Bill, corruption will end in India.
(అన్నా హజారే ప్రతిపాదించిన లోక్‌పాల్ బిల్లు ఆమోదిస్తే అవినీతి అంతమైపోతుందనుకుంటా.)
Kashyap: You are thoroughly mistaken. Only, cases of corruption will come to light early.
(నువ్వు పూర్తిగా పొరబడ్డావు. అదేం జరగదు. అయితే అవినీతి వ్యవహారాలు త్వరగా బయటపడతాయి.)
b) I was thoroughly mistaken in my opinion of him = అతడిని గురించి అభిప్రాయంలో నేను పూర్తిగా పొరబడ్డాను. (thorough - ఇంకో అర్థం - క్షుణ్ణంగా)
Examine, search, prepare - వీటితో కూడా 'thorough/ thoroughly' వాడతాం.
a) The doctor examined the patient thoroughly = డాక్టరు రోగిని క్షుణ్ణంగా పరీక్షించాడు.
b) The police allowed people to enter the station only after a thorough search/ after searching the place thoroughly.
(పోలీసులు ఆ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే, ప్రజలను అనుమతించారు.)
c) He took the exam after thorough preparation = పూర్తి సంసిద్ధతతోనే అతడు పరీక్ష రాశాడు.
d) He is thorough with the subject and can answer any question = అతడికి విషయం క్షుణ్ణంగా తెలుసు. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలడు.
3) Rush to some one's help = ఒకరికి సహాయం వేగంగా అందించడం.
a) Harish: What's all this noice about?
(ఏంటీ గొడవంతా?)
Aparna: A bus has caught fire and people are rushing to help the victims
(బస్ తగలబడి పోతోంది. బాధితులకు సాయం అందించేందుకు జనం పరుగెత్తుతున్నారు.)
b) The authorities are rushing food supplies to the flood victims.
(వరద బాధితులకు అధికారులు ఆహారాన్ని వేగంగా అందిస్తున్నారు.)
4) Implement = Put into action = ఆచరణలో పెట్టడం/ అమలు పరచడం = execute.
a) Somu: It certainly is a well thought of plan.
(అది మంచి ఆలోచనతో చేసిన ప్రణాళిక.)
Ramu: The plans are all well thought of, but who implements them?
(అన్ని ప్రణాళికలూ ఆలోచనతో కూడుకున్నవే. కానీ వాటిని అమలు పర్చేదెవరూ?)
b) Plans are easy to make but difficult to implement = ప్రణాళికలు చేయడం సులభమే, కాని వాటిని ఆచరణలో పెట్టడమే కష్టం.
Look at some more collocations here:
Make a plan; A well thought of plan.
5) Go to/ come to someone's rescue = ఆపద నుంచి కాపాడటం/ ఆదుకోవడం.
a) Madan: He is so poor. How is he able to do such an expensive course?
(అతను బీదవాడు కదా! అంత ఖరీదైన చదువు ఎలా చదవగలుగుతున్నాడు?)
Mohan: He was about to give up his studies, but his wealthy uncle came to his rescue.
(చదువు దాదాపు ఆపేశాడతడు. ఇంతలో బాగా డబ్బున్న వాళ్ల మామయ్య అతన్ని ఆదుకున్నాడు.)
b) Remember how Srikrishna went to the rescue of Draupadi?
(శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఎలా ఆదుకున్నదీ గుర్తుంది కదా!)
c) Sumanth: I am ready to buy the car at any cost.
(ఎంత ధరైనా ఆ car కొనేందుకు నేను సిద్ధం.)
Hemanth: Don't be foolish. If you squander money like this, nobody will come to your rescue.
(పిచ్చి పనులు చేయకు. ఇలా డబ్బు పారేసుకుంటే నిన్ను ఆదుకునే వాళ్లెవరూ ఉండరు.)
COLLOCATIONS - 13
COLLOCATIONS - 13
Sumanth: I heaved a sigh of relief when I heard the news that Vibhav is out of danger.(వైభవ్ ప్రమాదం నుంచి బయటపడ్డాడన్నమాట వినగానే 'హమ్మయ్యా అనుకున్నాను.)
Vikranth: What are you talking about? I'm unable to make head or tail of what you are talking.
(దేన్ని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు మాట్లాడుతున్నదేంటో నాకు తలా తోకా తెలీడం లేదు.)
Sumanth: Don't you know? Vibhav was run over by a truckyesterday morning. I got the call when I was about to start foroffice. We rushed him to hospital. With multiple injuries, he was bleeding profusely through the nose and the mouth.(తెలీదా నీకు? నిన్న వైభవ్ లారీ కింద పడ్డాడు. ఆఫీసుకు బయల్దేరబోతుండగా పిలుపు వచ్చింది నాకు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లాం. చాలా చోట్ల గాయాలతో అతని ముక్కు, నోటి నుంచి బాగా రక్తస్రావం అయ్యింది.)
Vikranth: Wait. So he is OK now. Why wasn't I informed?
(ఉండూ. ఇప్పుడు కులాసానే కదా. నాకెవరూ చెప్పలేదేం?)
Sumanth: We were in no position to think of anything. For my part, to tell you frankly, I didn't have a ray of hope of his survival. Only this morning did the doctor declare him out of danger.
(అప్పుడు ఏ విషయమూ ఆలోచించే పరిస్థితిలో లేం. నా విషయానికొస్తే నిజం చెప్పాలంటే అతడు బతుకుతాడనే ఆశ నాకేం కనపడలేదు. ఉదయాన్నే డాక్టరు అతను ప్రమాదం నుంచి బయటపడ్డాడని తెలిపాడు.)
Vikranth: So God is on our side and he is on his way to recovery. I must rush to the hospital to see him. He is quite cautious while crossing roads, isn't he?
(అంటే దేవుడు మన పక్షాన ఉన్నాడన్నమాట. అతను కోలుకుంటున్నాడు. వెంటనే ఆస్పత్రికెళ్లి అతడిని చూడాలి. రోడ్డు దాటేప్పుడు జాగ్రత్తగానే ఉంటాడు కదా?)
Sumanth: He is, but yesterday he walked out of home in a fit of anger at his son over something, and was off his guard. Thatcaused the trouble.
(అవును. కానీ నిన్న వాళ్లబ్బాయి మీద కోపావేశంలో నడుస్తూ కాస్త అజాగ్రత్తగా ఉన్నాడు.)
Vikranth: Let me go to the hospital first and see him. Bye.
(ఆస్పత్రికెళ్లి నేను చూసొస్తాను. వస్తా.)
Notes:
1. Run over by a truck= లారీ కింద మనిషి పడటం.
2. multiple injuries = చాలా గాయాలు
3. bleeding = రక్తం కారడం
4. for my part = నామట్టుకు నాకు, నా విషయానికొస్తే
5. frankly = ఉన్నదున్నట్టు చెప్పడం.
Look at the following expressions from the conversation above:
1) Heave a sigh of relief/ Breathe a sigh of relief/ a sigh of relief:
i) Relief = హాయి అనిపించడం - The happiness we feel when a bad thing ends/ a bad thing doesn't happen = మనం అనుభవిస్తున్న ఇబ్బంది తొలగిపోయినప్పుడు, మనం భయపడ్డ ఇబ్బంది జరగనప్పుడు, మనకు కలిగే హాయి. మంచి ఎండలోంచి నీడలోకి వచ్చినప్పుడు/ AC room లో ఉన్నప్పుడు కలిగే హాయి relief. 'హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం - relief. పెద్దబరువు మననెత్తి నుంచి దిగిపోయినప్పుడు కలిగే ఊరట - relief.
అలాంటి relief కలిగినప్పుడు, మనం 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకోవడం - Breathe a sigh of relief (sigh = నిట్టూర్పు )- we sigh in sorrow, we sigh in relief too = నిరాశలోనూ నిట్టూర్పు విడుస్తాం. కష్టం నుంచి బయట పడ్డప్పుడూ ఊపిరి పీల్చుకుని నిట్టూర్పు విడుస్తాం.
Heave a sigh/ Breathe a sigh of relief = హాయిగా ఊపిరి పీల్చుకోడం.
a) Pradhan: You look relaxed, what could be the reason?
(చాలా విశ్రాంతిగా కనిపిస్తున్నావు. కారణం ఏమై ఉండొచ్చు?)
Vardhan: The exams are over. Reason to heave a sigh/ breathe a sigh of relief.
(పరీక్షలయిపోయాయి. 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకోవడానికి సరైన కారణమే కదా?)
b) Sundar: You need not pay any more. Your dues are cleared.
(నువ్వింకేం చెల్లించక్కర్లేదు. నువ్వు తీర్చాల్సిన అప్పు తీరిపోయింది.)
Jayaram: Oh...! What a relief! (ఎంత హాయిగా ఉందో- ఇలా అనుకోవడం. heaving/breathing a sigh of relief).
Collocation point:
Relief - ఇబ్బంది నుంచి బయటపడటం.
A sigh of relief = అలా ఇబ్బంది నుంచి బయట పడ్డప్పుడు మనం హాయిగా ఊపిరి పీల్చుకోవడం = Heave/ breathe a sigh of relief.
When a person is declared out of danger, the relatives heave/ breathe a sigh of relief = ఎవరికైనా ప్రమాదం తప్పింది అన్నప్పుడు వాళ్ల దగ్గర చుట్టాలు ఊపిరి పీల్చుకుంటారు.
Reliefకు ఇంకా చాలా అర్థాలున్నాయి.
2) Make head or tail of something- తలాతోకా అర్థం చేసుకోలేకపోవడం.
a) Nitish: What did David tell you? (డేవిడ్ ఏం చెప్పాడు నీతో?)
Krishna: If I could explain it to you, I can explain anything. I just couldn't make head or tail of what he had said.
(అది నేను వివరించగలిగితే ఏదైనా వివరించగలను. వాడు చెప్పింది నాకు తలాతోకా అర్థం కాలేదు.)
3) Bleed profusely: Bleed = రక్తం కారడం, ముఖ్యంగా గాయాల నుంచి. 'Profuse bleeding' అంటే బాగా రక్తం కారడం. ఎప్పుడూ bleeding profuse తో collocate అవుతుంది. Profuse bleeding చాలా ఎక్కువగా వాడతారు Englishలో
a) Chandan: What's (What has) happened to your finger? It's plastered.
(ఏమైంది నీ వేలికి? ప్లాస్టర్ వేశావు?)
Abdul: I cut my finger yesterday while slicing an apple. Oh my! It began to bleed profusely
(ఆపిల్‌పండు కోస్తుంటే వేలు తెగింది. అబ్బో! ఒకటే రక్తం కారడం మొదలెట్టింది.)
b) Madan: Was it a severe injury that Sumanth had?
(సుమంత్‌కయిన గాయం చాల తీవ్రమైందేనా?)
Venkat: In addition to the fracture, there were bruises too, from which there was profuse bleeding.
(చాలా గాయాలతో పాటు చాలాచోట్ల డొక్కుపోయింది. వాటి నుంచి ధారాళంగా రక్తస్రావమైంది.)
Profuse ను, apologize (అపలజైజ్ = క్షమాపణ చెప్పడం) apologies (క్షమాపణలు)తో కూడా కలిపి వాడ్తాం.
a) He apologized profusely for his wrong doings = తను చేసిన తప్పిదాలకు అతడు ఉదారంగా క్షమాపణ చెప్పాడు.
b) Our profuse apologies to you for the inconvenience = మీకు కలిగిన అసౌకర్యానికి మేమెంతో చింతిస్తున్నాం. మా క్షమాపణలు.
4) A ray of hope : ఆశారేఖ- ఏదో మంచి జరుగుతుందన్న చిన్న ఆశ.
a) Bhaskar: How corrupt our nation is! Will India be ever free from corruption?
(మన జాతి ఎంత అవినీతిగా ఉంది! భారత్ ఎప్పటికైనా ఈ అవినీతి నుంచి బయట పడుతుందా?)
Ganesh: There is still a ray of hope with the initiative the courts and the CBI are taking.
(ఏదో ఆశారేఖ ఇంకా వెలుగుతోంది - కోర్టులు, CBI వాళ్లు తీసుకుంటున్న చొరవ వల్ల)
b) Rahim: The doctor's words have given us all a ray of hope of his survival.
(డాక్టర్ మాటలు మాలో ఒక ఆశాకిరణాన్ని కలిపించాయి.)
5) A fit of anger - కోపావేశంలో. కోపం కలిగించే ఆవేశాన్ని 'fit' అంటాం. (మామూలుగా fitకు అర్థం తెలుసుకదా - మూర్ఛ వచ్చి వణుకుతూ పడిపోవడం) అలాగే, వణికిపోతున్న కోపాన్ని 'fit of anger' అంటాం. A sigh of, relief తో collocate అయినట్లే, A fit of, anger, rage (తీవ్రమయిన కోపం)తో collocate అవుతుంది.
a) In a fit of anger he threw the chair at the boy = కోపావేశంలో ఆ కుర్రాడి మీదికి, ఆయన కుర్చీ విసిరాడు.
b) Madan: Where are you going?
(ఎక్కడికి వెళ్తున్నావు?)
Naresh: You told me to get out
(నన్ను వెళ్లిపొమ్మన్నావు.)
Madan: I said it in a fit of anger. Don't take it seriously. Stay on.
(ఏదో కోపావేశంలో అన్నాను. పట్టించుకోకు. ఉండు)
అలాగా fit of laughter - (పగలబడి నవ్వడం)/Burst into a fit oflaughter - ఉన్నట్టుండి పగలబడి నవ్వడం.
On hearing the joke he burst into a fit of laughter = జోక్ వినగానే అతడు పగలబడి నవ్వాడు.
COLLOCATIONS - 12
COLLOCATIONS - 12
Stinking rich, closely related, distant cousin/ close cousin, sumptuous dinner లాంటి Collocations గురించి తెలుసుకుందాం. వీటినెలా ప్రయోగించాలో ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం...Bhanu: He is highly propertied, isn't he? (అతడు బాగా ఆస్తిపరుడు కదా?)
Praveen: Who do you mean? My cousin, Prakash? Not propertied, as you would say, but richstinking rich. All in cash, and in the stock and share market. They do own a big house but that's all the immovable property they have. (ఎవరి గురించి నువ్వనేదీ, మా cousin ప్రకాష్ విషయమా? నువ్వన్నట్టుగా ఆస్తిపరుడు కాదు, కానీ డబ్బు బాగా మూలుగుతున్నవాళ్లు. అంతా నగదు, stocks and sharesతో పాటు వాళ్లకో పెద్ద ఇల్లుంది. అయితే అదొక్కటే వాళ్లకున్న స్థిరాస్తి.
Bhanu: How are you related? (మీ ఇద్దరి చుట్టరికం ఏంటి? మీరిద్దరూ ఎలా బంధువులు?)
Praveen: Not very close. He is a distant cousin of mine. What a rich life theylead! They eat and throw sumptuous dinners quite often, and move about in sleek cars. But for all that they are quite nice people. Time was, though in the distant past, when their grandparents were just middle class people, his grandfather doing a small job in government service.(అంత దగ్గరేం కాదు. అతడు నాకు దూరపు చుట్టం. ఎంత ధనిక జీవితం గడుపుతారో వాళ్లు! తరచూ సుష్ఠుగా విందులారగిస్తూ, పెడుతూ ఉంటారు. అందమైన కార్లలో తిరుగుతారు. ఏదేమన్నా ఎంత ఉన్నవాళ్లయినా మంచివాళ్లు. ఎపుడో చాలా పాతరోజుల్లో వాళ్ల తాత, బామ్మలు సాదాసీదా మధ్యతరగతి వాళ్లు. వాళ్ల తాత చిన్న ప్రభుత్వ ఉద్యోగి.)
Bhanu: You know, I notice a close resemblance between Prasad and Kiran.Kiran is also related to you, isn't he? (ప్రసాద్‌కూ, కిరణ్‌కూ మధ్య చాలా పోలిక కనిపిస్తుంది. కిరణ్‌కూ, నీకూ చుట్టరికం ఉంది కదా?)
Praveen: The resemblance is no surprise. They are first degree cousins. Theirmothers are sisters. But they don't get on well. Either of the sisters picked a quarrel with the other. Their relations broke down. But that was a long time ago, and that soured their relations. I don't see their becoming any close in the near future.(వాళ్ల పోలిక పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. వాళ్లు అతి దగ్గర సంబంధం ఉన్నవాళ్లు. వాళ్ల అమ్మలు అక్కాచెల్లెళ్లు. కానీ వాళ్లకు సత్సంబంధాలు లేవు. వాళ్లల్లో ఎవరో ఇంకొకరితో పోట్లాట పెట్టుకున్నారు. అదెప్పుడోలే, అయితే అది వాళ్ల బంధుత్వాన్ని చెడిపేసింది. వాళ్లు దగ్గరవడం ఇప్పట్లో లేని మాట.)
Bhanu: I heard that Preethi, our schoolmate is a cousin of Prasad too. What is she now? (మనతో స్కూల్లో చదువుకున్న ప్రీతి కూడా ప్రసాద్ చుట్టమే అట కదా? ఏం చేస్తోంది ఇప్పుడు?)
Prasad: She is doing a course in hotel management in Chennai. How we areindulging in idle gossip! (చెన్నైలో Hotel Management చేస్తోంది. పనికిరాని కబుర్లతో ఎలా కాలక్షేపం చేస్తున్నామో మనం!)
Bhanu: I can't but agree with you. Let's do something useful. (కచ్చితంగా. నీతో నేను ఏకీభవిస్తున్నా. ఏదైనా ఉపయోగకరమైన పని చేద్దాం, ఈ కబుర్లాపి)
Notes:
1) Cousin: తల్లిదండ్రుల అక్కా చెల్లెళ్ల, అన్నాతమ్ముళ్ల బిడ్డలు. cousin sister, cousin brother వాడకం సరికాదు. అది Indian English.
2) indulge in = పాలుపంచుకోవడం/ పాల్పడటం - ముఖ్యంగా చెడు విషయాల్లో.
indulge in drink = తాగుడు అలవాటుండటం/ తాగుడుకు పాల్పడటం.
వివరంగా...

The place is stinking with rotten vegetables = మురిగిపోయిన కూరగాయలతో ఆ చోటు కుళ్లుకంపు కొడుతోంది.
a) Pradhan: He seems to have made a lot of money. He is quite rich.
(బాగా డబ్బు సంపాదించినట్టుంది. ఇప్పుడు బాగా ధనవంతుడుగా ఉన్నాడు)
Praveen: Not just rich. He is stinking rich.
(మామూలు ధనవంతుడు కాదు. అతడి దగ్గర డబ్బు బాగా మూలుగుతోంది.)
b) Though stinking rich, he is quite mean
(అతడి దగ్గర డబ్బు బాగా మూలుగుతున్నా, చాలా పిసినారి అతడు, నీచుడు.) (Miser - పిసినారి)
You know it is usually the rich that are miserly (తెలుసు కదా? డబ్బు బాగా ఉన్న వాళ్లే పిసినారులుగా ఉంటారు)

She is related to him, on her mother's side = అతడికి ఆమె తల్లి వైపు చుట్టం.
Relationship = చుట్టరికం.
closely related = దగ్గర సంబంధం ఉన్న × distantly related = దూరపు సంబంధం ఉన్న.
'Close, distant' collocate with relationship; 'closely, distantly' collocate withrelated.
a) Bhavan: I see Mohan and Madan resemble each other.
(మోహన్‌కూ మదన్‌కూ దగ్గర పోలికలున్నాయి, గమనించా)
Bhargav: Not surprising. They are very closely related.
(అందులో ఆశ్చర్యం ఏం లేదు. వాళ్లిద్దరికీ చాలా దగ్గర చుట్టరికం ఉంది)
Susanth: He very often claims that he can get anything done by the minister.
(మంత్రిగారి చేత ఏదైనా చేయించగలనని అతడు తరచూ అంటుంటాడు)
Prabhat: He claims that he is a relative of the minister, but I know for sure they are only distantly related.
(మంత్రిగారి చుట్టానన్ని చెప్పుకుంటాడు గానీ, నాకూ బాగా తెలుసు. వాళ్లు చాలా దూరపు చుట్టరికం కలవాళ్లని)
అలాగే cousin కూడా. అన్నదమ్ముల బిడ్డలూ, అక్కాచెల్లెళ్ల బిడ్డల్నే కాకుండా, మేనత్త మేనమామ బిడ్డలు కూడా Englishలో cousins.
He married his cousin (తన మేనమామ/ మేనత్త కూతురిని) అతడు పెళ్లి చేసుకున్నాడు.
అంటే వరసకు అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు మాత్రమే కాకుండా ఇతర రక్తసంబంధీకులు కూడా cousins.
Close cousin (దగ్గర సంబంధం ఉన్న) × distant cousin (దూరపు సంబంధం ఉన్న)
ఇవీ cousin కుండే collocations. ఇవి మామూలు సంభాషణలో బాగా వాడొచ్చు.

a) Sobha: You got up late this morning. Any special reason? (ఇవాళ ఉదయం చాలా ఆలస్యంగా నిద్ర లేచావు నువ్వు. ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?)
Keerthi: You are right. Nithya treated us to a sumptuous dinner last night and took us to a movie.
(నువ్వు రైటే. నిన్న రాత్రి నిత్య మాకు మాంచి dinner ఇచ్చి, సినిమాకు తీసుకెళ్లింది.)
b) Karthik: What's your dream? (నువ్వు కనే కల ఏంటి?)
Jagdish: Living in a big mansion in sumptuous surroundings, eating andthrowing sumptuous dinners)
(పెద్ద భవంతిలో జీవిస్తూ, సంపన్నమైన అందమైన పరిసరాల్లో, పసందయిన విందులారగిస్తూ, ఇతరులకు విందులిస్తూ గడపాలని) గమనించారు కదా! Sumptuous-dinner, meal, neighbourhood/ surroundings/ buildingsతో collocate అవుతుంది.
ఈ collocation కూడా గమనించండి.
Throw a dinner = ఇతరులకు విందులివ్వడం.
He throws a lavish dinner on every birth day = ప్రతి పుట్టినరోజూ చాలా ఖర్చయిన విందు ఇస్తాడతను.
Lavish = ఖర్చయిన
COLLOCATIONS - 11
COLLOCATIONS - 11
రోజువారీ సంభాషణల్లో, మామూలు రచనల్లో మనం తరచూ వాడగల collocations (word combinations) కొన్నింటిని పరిశీలిద్దాం.Mihir: You appear worried. (నువ్వు ఆందోళన పడుతున్నట్టున్నావు).
Arya: And why not, friend? Life is becoming more and more difficult day by day.(ఎందుకు కాదూ, రోజురోజుకూ జీవితం కష్టమైపోతోంది).
Mihir: What is the cause of your complaint? (ఏంటి నీ అసంతృప్తికి కారణం?)
Arya: Don't you see? Prices are soaring and no body seems to be bothered about it. (అర్థం కావడం లేదా, ధరలు పెరిగిపోతున్నాయి. ఎవరూ పట్టించుకున్నట్లులేదు.)
Mihir: Oh, that's what you mean. Yea, I've got to agree with you. There's been a steep rise in the prices of essential commodities. (అవును. నువ్వు చెప్పింది నేనొప్పుకుంటున్నాను. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి.)
Arya: That's mostly due to the escalation of petroleum prices. Our friend Nidhi, owning two petrol pumps, is quite happy whenever oil prices are hiked.(పెట్రోలియం ధరల పెరుగుదలే దానికి కారణం. మన స్నేహితుడు నిధి, రెండు పెట్రోలు బంకులుండటంతో, ధర పెరిగినప్పుడెంతో సంతోషపడ్తాడు.)
Mihir: The minute there is a talk in the air of petroleum prices going up, he puts up a 'no stock' board and hoards all the oil, to sell at a higher price when the new price is announced. (పెట్రోల్ ధరలు పెరుగుతాయనే మాట ప్రచారంలోకి వస్తే చాలు, అతడు 'స్టాకు లేదు' అని బోర్టు పెట్టేసి చమురు దాచేస్తాడు. కొత్త ధరలు ప్రకటించగానే ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి.)
Arya: What a striking similarity between him and his brother Anant in appearance. (ఆకారంలో వాడికీ, వాడి తమ్ముడికీ పోలిక కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.)
Mihir: As striking is the difference between the two in their nature and behaviour. Anant is quite gentle and helpful, whereas Nidhi is rather aggressive and is selfish. (అయితే వాళ్ల స్వభావంలోనూ, నడవడిలోనూ తేడా కూడా అంతే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.)
Arya: That's true. OK. For a change of topic, when are you planning to leave for Chennai? (అదీ నిజమే. మాట మారుద్దాం. చెన్నై ఎప్పుడు వెళ్దామనుకుంటున్నావు?)
Mihir: I'll let you know. (చెప్తాను.)
చూడండి.. ఈ వ్యక్తీకరణలు
Look at the following expressions from the conversation above:
1) What is the cause of your complaint?
2) Prices are soaring
3) There's (There has) been a steep rise in petroleum prices.
4) ... due to escalation of petroleum prices
5) ... Prices going up6) What a striking similarity!
1) Cause of your complaint: తెలుసు కదా?
Complaint అర్థాలు:
1) ఆరోపణ, 2) అసంతుష్టి- ఏదో బాధగా ఉండటం/ అసంతృప్తి. అసంతృప్తికి కారణం అనేందుకు Englishలో cause of complaint అంటాం. అలాగే cause to complain ఏదన్నా ఆరోపించేందుకు తగిన కారణం.
Look at the following...
a) Sampath: From now on I will not attend any of his parties (ఇప్పట్నుంచి వాడిచ్చే పార్టీలకు దేనికీ నేను రాను)
Sobhit: What's the cause of your complaint? (ఏంటి- నీ అసంతృప్తికి కారణం?)
Sampath: Not just one, but many which I don't have the time to tell you now.(ఒకటి కాదు, చాలా ఉన్నాయి. అవన్నీ నీతో చెప్పేందుకు నాకు వ్యవధి లేదు)
b) Praful has no cause to complain about the treatment given to him = తను పొందిన వైద్యం విషయంలో ఆరోపణలకు/ అసంతృప్తికీ ఏ కారణమూ లేదు.
2) Prices are soaring: ధరలు ఒక్కసారిగా పెద్దయెత్తున పెరుగుతున్నాయనే అర్థంతో దీన్ని వాడతాం.
Prices soar తో collocate అవుతుంది.
Soar - వేగంగా సునాయాసంగా గాలిలో కెగరడం
Birds/ rockets/ planes soar into the sky = పక్షులూ, రాకెట్లూ, విమానాలూ ఆకాశంలోకి వేగంగా ఎగురుతాయి.
a) The prices of gold and silver are soaring like never before = ఇంతకుముందెన్నడూ లేనివిధంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి విపరీతంగా, వేగంగా.
b) The soaring prices of gold and silver are worrying parents who want to get their daughters married =పెరుగుతున్న బంగారు వెండి ధరలు, పిల్లలకు పెళ్లిళ్లు చేయాలనుకునే తల్లిదండ్రుల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
3) A steep increase in prices: విపరీతమైన పెరుగుదల - ముఖ్యంగా ధరలు, రవాణా ఛార్టీల్లో, అటువంటి వాటిల్లో.
a) Kundan: There has been a steep increase in air fares of late. (ఈ మధ్య విమాన చార్జీల్లో విపరీతమైన పెరుగుదల ఉంది.)
Harsha: But that hasn't affected our ministers' trips to foreign countries (కానీ మన మంత్రుల విదేశీయానాలను అదేం ప్రభావితం చేయడంలేదు.)
b) The steep rise in petroleum prices has led to the steep rise in APSRTC bus fares.
(పెట్రోలియం ధరల విపరీతమైన పెరుగుదల APSRTC Charges విపరీతమైన పెరుగుదలకు దారి తీసింది.)4) Escalation of prices: ధరల పెరుగుదలనే తెలిపే ఇంకో collocation ఇది. కాస్త పాండిత్యం, మామూలు సంభాషణలో అంతగా వాడం.
5) Prices are going up: వ్యావహారికంగా ఎక్కువగా వాడగల్గినవి- Prices are going up/rising/ soaring - ఈ క్రమంలో.
b) ధరల విపరీత పెరుగుదల - a steep rise in prices.
6) Striking similiraty/ striking resemblance = కొట్టొచ్చినట్టు (స్పష్టంగా) కనపడే పోలికలు/ తేడాలు
Striking = స్పష్టంగా/ గమనించకుండా ఉండలేని,
Similarity = resemblance = పోలిక.
a) The similarity/ resemblance between the twins is striking = ఆ కవలల పోలిక కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
b) The resemblance is so striking that you are certain to mistake one for the other = నువ్వు వాళ్లల్లో ఒకర్నిచూసి ఇంకొకరుగా పొరపాటు పడేంత పోలిక ఉంది వాళ్లిద్దరికీ.అలాగే తేడా, వైరుధ్యం అంత బాగా ఉన్నా అదీ striking difference/ contrast (వైరుధ్యం).
a) There is a striking difference in the attitudes of the Loksatta and the other parties to electioneering = ఎన్నికల ప్రచారం విషయంలో లోక్‌సత్తాకూ, ఇతర పార్టీలకూ స్పష్టమైన తేడా ఉంది.
b) In striking contract to the earlier days, we are much kinder to wild animals =పాత రోజులకు ఎంతో విరుద్ధంగా మనం వన్యమృగాల పట్ల ఎక్కువ సానుభూతి చూపుతున్నాం.
Collocations summary
a) Cause of/ for complaint
b) Prices rise/ go up/ soar/ escalate - soaring/ rising/ escalating prices (ధరలను పెంచడం - put up.)
The oil companies have put up prices once again = చమురు సంస్థలు మళ్లీ ధరలు పెంచాయి.
c) Striking similarity/ resemblance/ difference.
Subscribe to:
Posts (Atom)