COLLOCATIONS - 15

COLLOCATIONS - 15

కొన్ని పదాలు కొన్నిటితో కలిసివస్తేనే అర్థస్ఫూర్తి కలుగుతుంది. చెప్పదలిచిన భావం స్పష్టంగా, పదునుగా అవతలి వ్యక్తికి చేరుతుంది. ఏ పదం దేనితో collocate అవుతుందో గ్రహించి, వాటిని అదేవిధంగా వాడటం విద్యార్థుల భాషాజ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది.
Ranjit: Why do you reject my proposal out of hand? Why don't you give some consideration to it? నా ప్రతిపాదనను ఏం ఆలోచించకుండానే ఎందుకు కాదంటావు? దానికెందుకు కాస్త పరిగణన ఇవ్వవు?
Balaji: Far from it. It's only after due consideration, I've come to the conclusion that your plan won't work. I suggest that you take a fresh look at it, and think of an alternative. అదేం లేదు. బాగా పరిశీలించిన తర్వాతనే నీ ప్రణాళిక పని చేయదనే నిర్ధారణకొచ్చాను. నా సూచనేంటంటే దాన్ని మరోసారి పరిశీలించి ప్రత్యామ్నాయం ఉంటుందేమో చూడు.
Ranjit: You'd better know that it is not just my plan. In fact the MD unveiled the plan in the board meeting last week. అది నా ప్రణాళిక అని మాత్రమే అనుకోకు దాన్ని నువ్వు. అసలది మన Managing Director గత వారం బోర్డు సమావేశంలో ఆవిష్కరించారు.
Balaji: And perhaps he asked you to drum up support for it, didn't he? Nothing escapes my notice. ఆయన నిన్ను దానికి మద్దతు కూడగట్టమని చెప్పాడు కదా? నా దృష్టి/ఆలోచన నుంచి ఏదీ తప్పించుకోలేదు.
Ranjit: Perhaps so. But still you take a second look at it, and let me know by tomorrow evening. The plan, in my opinion is the best in the circumstances. If by a stroke of luck the plan works, the company will make a huge fortune, and we will benefit too. అవచ్చు. మళ్లీ నువ్వది ఇంకోసారి ఆలోచించి రేపు సాయంత్రం నాకు చెప్పు. ప్రస్తుత పరిస్థితిలో ఇది అత్యుత్తమ పథకం. అదృష్టవశాత్తూ అది పనిచేసిందా కంపెనీకి బాగా లాభాలు వస్తాయి. మనమూ లాభపడ్తాం.
Balaji: If you can allow me to make slight alterations in the plan, I don't mind passing it. ఆ ప్రణాళికలో కొద్దిపాటి మార్పులకు అనుమతిస్తే దాన్ని ఆమోదించేందుకు అభ్యంతరం లేదు.
Now look at the following sentences from the dialogue above. 
1) .... reject my proposal out of hand 
2) ... take a fresh look at something a second look at something 
3) ... drawn up support 

1) Reject my proposal out of hand


Reject అంటే తెలుసు కదా? తోసిపుచ్చటం. 

Reject a proposal out of hand= ఏమాత్రం ఆలోచించకుండా తోసి పుచ్చటం లేదా కొట్టిపారేయటం. 
Rejectచాలామటుకు ' out of hand' తో collocateఅవుతుంటుంది.
a) Eswar: Tarun doesn't think at all. He thinks he alone is right. (తరుణ్‌ అసలు ఆలోచించడు. తనొక్కడే ఎప్పుడూ సరి అనుకుంటాడు. 
Ganesh: What's happened now? (ఇప్పుడేం జరిగింది?)
Eswar: I proposed that we expand our business. He dismissed it out of hand(మన వ్యాపారం విస్తరిద్దామని ప్రతిపాదించాను. ఆలోచనా పాలోచనా లేకుండానే తిరస్కరించాడు.)
b) Gangadhar: How is Hemanth's condition now? (హేమంత్‌ పరిస్థితి ఎలా ఉంది?)
Hanuman: Getting worse by the day. I suggested Homeopathy. He refused it out of hand. (రోజురోజుకూ క్షీణిస్తోంది. నేను హోమియోమందు వాడమన్నాను. అసలేం ఆలోచించకుండా దాన్ని కాదన్నాడు.)
 చూశాం కదా, out of hand, reject, dismiss, refuse తో collocateఅవుతుంది.
Don't reject anything out of hand. Think well before you do it. దేన్నీ అనాలోచితంగా తృణీకరించవద్దు. అది చేసేముందు బాగా ఆలోచించు.
2) Take a fresh look at something =దేన్నైనా కొత్తగా ఆలోచించటం. 
fresh look=నూతన ఆలోచనాసరళి లేదా కొత్తగా ఆలోచించటం. 
ఇది takeతో collocateఅవుతుంది.
a) Indeevar: I don't find any good in your advice (నీ సలహాలో నాకేం మంచి కన్పించడం లేదు)
Jairam: Then why ask for my advice? You take a fresh look at it and decide for yourself. (అలాంటప్పుడు నా సలహా ఎందుకడగటం? నువ్వే మరోసారి కొత్త కోణంలో ఆలోచించి నిర్ణయం తీస్కో)
b) Kiran: What has to be done to end corruption in India ? (భారత్‌లో అవినీతిని ఎలా అంతం చేయటం?)
Kesav: The whole problem demands our taking a fresh look at it.(ఆ సమస్యను మనం సమూలంగా కొత్త కోణం నుంచి ఆలోచించాలి)
 Take, 'a second look' తో కూడా collocateఅవుతుంది. 
Take a second look=Think again= పునరాలోచించడం
3) to drum up support = మద్దతు కూడగట్టడం, గట్టి ప్రయత్నంతో.
 a) Lekhak: Though the leader is in jail, those joining his party are increasing day by day ( ఆ నాయకుడు జైల్లో ఉన్నప్పటికీ, అతని పార్టీలో చేరేవాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది)
Lavanya: He doesn't lack people to drum up support for him. (అతనికి మద్దతు కూడగట్టేవాళ్ల సంఖ్యకు కొదవలేదు)
b) Mohan: Why is Ganesh so close to Nikhil? (గణేష్‌ని, నిఖిల్‌తో అంత సన్నిహితంగా ఎందుకుంటాడు?)
Manoj: Because whatever Ganesh does, Nikhil drums up support for him. (గణేష్‌ ఏం చేసినా నిఖిల్‌ దానికి మద్దతు కూడగడ్తాడు)