COLLOCATIONS - 13

COLLOCATIONS - 13

Sumanth: I heaved a sigh of relief when I heard the news that Vibhav is out of danger.
                  
(వైభవ్ ప్రమాదం నుంచి బయటపడ్డాడన్నమాట వినగానే 'హమ్మయ్యా అనుకున్నాను.)

Vikranth: What are you talking about? I'm unable to make head or tail of what you are talking.
                
(దేన్ని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు మాట్లాడుతున్నదేంటో నాకు తలా తోకా తెలీడం లేదు.)

Sumanth: Don't you know? Vibhav was run over by a truckyesterday morning. I got the call when I was about to start foroffice. We rushed him to hospital. With multiple injuries, he was bleeding profusely through the nose and the mouth.(తెలీదా నీకు? నిన్న వైభవ్ లారీ కింద పడ్డాడు. ఆఫీసుకు బయల్దేరబోతుండగా పిలుపు వచ్చింది నాకు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లాం. చాలా చోట్ల గాయాలతో అతని ముక్కు, నోటి నుంచి బాగా రక్తస్రావం అయ్యింది.)
Vikranth: Wait. So he is OK now. Why wasn't I informed?
                  (ఉండూ. ఇప్పుడు కులాసానే కదా. నాకెవరూ చెప్పలేదేం?)

Sumanth: We were in no position to think of anything. For my part, to tell you frankly, I didn't have a ray of hope of his survival. Only this morning did the doctor declare him out of danger.
(అప్పుడు ఏ విషయమూ ఆలోచించే పరిస్థితిలో లేం. నా విషయానికొస్తే నిజం చెప్పాలంటే అతడు బతుకుతాడనే ఆశ నాకేం కనపడలేదు.  ఉదయాన్నే డాక్టరు అతను ప్రమాదం నుంచి బయటపడ్డాడని తెలిపాడు.)

Vikranth: So God is on our side and he is on his way to recovery. I must rush to the hospital to see him. He is quite cautious while crossing roads, isn't he?
                 (అంటే దేవుడు మన పక్షాన ఉన్నాడన్నమాట. అతను కోలుకుంటున్నాడు. వెంటనే ఆస్పత్రికెళ్లి అతడిని చూడాలి. రోడ్డు దాటేప్పుడు జాగ్రత్తగానే ఉంటాడు కదా?)

Sumanth: He is, but yesterday he walked out of home in a fit of anger at his son over something, and was off his guard. Thatcaused the trouble.
                  (అవును. కానీ నిన్న వాళ్లబ్బాయి మీద కోపావేశంలో నడుస్తూ కాస్త అజాగ్రత్తగా ఉన్నాడు.)

Vikranth: Let me go to the hospital first and see him. Bye.
                   (ఆస్పత్రికెళ్లి నేను చూసొస్తాను. వస్తా.)

Notes:
1. Run over by a truck= లారీ కింద మనిషి పడటం.
2. multiple injuries = చాలా గాయాలు
3. bleeding = రక్తం కారడం
4. for my part = నామట్టుకు నాకు, నా విషయానికొస్తే
5. frankly = ఉన్నదున్నట్టు చెప్పడం.
Look at the following expressions from the conversation above:
1) Heave a sigh of relief/ Breathe a sigh of relief/ a sigh of relief:

    
i) Relief = హాయి అనిపించడం - The happiness we feel when a bad thing ends/ a bad thing doesn't happen = మనం అనుభవిస్తున్న ఇబ్బంది తొలగిపోయినప్పుడు, మనం భయపడ్డ ఇబ్బంది జరగనప్పుడు, మనకు కలిగే హాయి. మంచి ఎండలోంచి నీడలోకి వచ్చినప్పుడు/ AC room లో ఉన్నప్పుడు కలిగే హాయి relief. 'హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం - relief. పెద్దబరువు మననెత్తి నుంచి దిగిపోయినప్పుడు కలిగే ఊరట - relief.
       
అలాంటి relief కలిగినప్పుడు, మనం 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకోవడం - Breathe a sigh of relief (sigh = నిట్టూర్పు )- we sigh in sorrow, we 
sigh in relief too = నిరాశలోనూ నిట్టూర్పు విడుస్తాం. కష్టం నుంచి బయట పడ్డప్పుడూ ఊపిరి పీల్చుకుని నిట్టూర్పు విడుస్తాం.
        
Heave a sigh/ Breathe a sigh of relief = హాయిగా ఊపిరి పీల్చుకోడం.

a) Pradhan: You look relaxed, what could be the reason?
                       (చాలా విశ్రాంతిగా కనిపిస్తున్నావు. కారణం  ఏమై ఉండొచ్చు?)
     
Vardhan: The exams are over. Reason 
to heave a sigh/ breathe a sigh of relief.
                       (పరీక్షలయిపోయాయి. 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకోవడానికి  సరైన కారణమే కదా?)
 
b) Sundar: You need not pay any more. 
Your dues are cleared.
                     (నువ్వింకేం చెల్లించక్కర్లేదు. నువ్వు తీర్చాల్సిన అప్పు తీరిపోయింది.)
    
Jayaram: Oh...! What a relief! (ఎంత హాయిగా ఉందో- ఇలా అనుకోవడం. heaving/
breathing a sigh of relief).         


Collocation point: 
Relief - ఇబ్బంది నుంచి బయటపడటం. 
A sigh of relief = అలా ఇబ్బంది నుంచి బయట పడ్డప్పుడు మనం హాయిగా ఊపిరి పీల్చుకోవడం = Heave/ breathe a sigh of relief.
       
When a person is declared out of danger, the relatives heave/ breathe a sigh of 
relief = ఎవరికైనా ప్రమాదం తప్పింది అన్నప్పుడు వాళ్ల దగ్గర చుట్టాలు ఊపిరి పీల్చుకుంటారు.
       
Reliefకు ఇంకా చాలా అర్థాలున్నాయి.

2) Make head or tail of something- తలాతోకా అర్థం చేసుకోలేకపోవడం.
    
a) Nitish: 
What did David tell you? (డేవిడ్ ఏం చెప్పాడు నీతో?)
        
Krishna: If I could explain it to you, I can explain anything. I just couldn't make 
head or tail of what he had said.
                        (అది నేను వివరించగలిగితే ఏదైనా వివరించగలను. వాడు చెప్పింది నాకు తలాతోకా అర్థం కాలేదు.)
  

3) Bleed profusely: Bleed = రక్తం కారడం, ముఖ్యంగా గాయాల నుంచి. 'Profuse bleeding' అంటే బాగా రక్తం    కారడం. ఎప్పుడూ bleeding profuse తో collocate అవుతుంది. Profuse bleeding చాలా ఎక్కువగా వాడతారు Englishలో
     
a) Chandan: What's (What has) happened 
to your finger? It's plastered.
      
(ఏమైంది నీ వేలికి? ప్లాస్టర్ వేశావు?)
         
Abdul: I cut my finger yesterday while slicing an apple. Oh my! It began to bleed 
profusely
                      (ఆపిల్‌పండు కోస్తుంటే వేలు తెగింది. అబ్బో! ఒకటే రక్తం కారడం మొదలెట్టింది.)
     
b) Madan: Was it a severe injury that 
Sumanth had?
                         (సుమంత్‌కయిన గాయం చాల తీవ్రమైందేనా?)
           
Venkat: In addition to the fracture, there were bruises too, from which there was profuse 
bleeding.
           
(చాలా గాయాలతో పాటు చాలాచోట్ల డొక్కుపోయింది. వాటి నుంచి ధారాళంగా రక్తస్రావమైంది.)          

Profuse ను, apologize (అపలజైజ్ = క్షమాపణ చెప్పడం) apologies (క్షమాపణలు)తో కూడా కలిపి వాడ్తాం.
      
a) He apologized profusely for his 
wrong doings = తను చేసిన తప్పిదాలకు అతడు ఉదారంగా క్షమాపణ చెప్పాడు.
      
b) Our profuse apologies to you for the 
inconvenience = మీకు కలిగిన అసౌకర్యానికి మేమెంతో చింతిస్తున్నాం. మా క్షమాపణలు.


4) A ray of hope : ఆశారేఖ- ఏదో మంచి జరుగుతుందన్న చిన్న ఆశ.
      
a) Bhaskar: How corrupt our nation is! 
Will India be ever free from corruption?
                           
(మన జాతి ఎంత అవినీతిగా ఉంది! భారత్ ఎప్పటికైనా ఈ అవినీతి నుంచి బయట పడుతుందా?)
           
Ganesh: There is still a ray of hope with the initiative the courts and the CBI are 
taking.
                           
(ఏదో ఆశారేఖ ఇంకా వెలుగుతోంది - కోర్టులు, CBI వాళ్లు తీసుకుంటున్న చొరవ వల్ల)
     
b) Rahim: The doctor's words have 
given us all a ray of hope of his survival.
                        
(డాక్టర్ మాటలు మాలో ఒక ఆశాకిరణాన్ని కలిపించాయి.)

5) A fit of anger - కోపావేశంలో. కోపం కలిగించే ఆవేశాన్ని 'fit' అంటాం. (మామూలుగా fitకు అర్థం తెలుసుకదా - మూర్ఛ వచ్చి వణుకుతూ పడిపోవడం) అలాగే, వణికిపోతున్న కోపాన్ని 'fit of anger' అంటాం. A sigh of, relief తో collocate అయినట్లే, A fit of, anger, rage (తీవ్రమయిన కోపం)తో collocate అవుతుంది.
 
a) In a fit of anger he threw the chair at 
the boy = కోపావేశంలో ఆ కుర్రాడి మీదికి, ఆయన కుర్చీ విసిరాడు.      

b) Madan: Where are you going?
                            (ఎక్కడికి వెళ్తున్నావు?)
      
Naresh: 
You told me to get out
                          (నన్ను వెళ్లిపొమ్మన్నావు.)
      
Madan: I said it in a fit of anger. Don't 
take it seriously. Stay on.
                           
(ఏదో కోపావేశంలో అన్నాను. పట్టించుకోకు. ఉండు)
       అలాగా fit of 
laughter - (పగలబడి నవ్వడం)/Burst into a fit of
laughter - ఉన్నట్టుండి పగలబడి నవ్వడం.          

On hearing the joke he burst into a fit of laughter = జోక్ వినగానే అతడు పగలబడి నవ్వాడు.