COLLOCATIONS - 12

COLLOCATIONS - 12

Stinking rich, closely related, distant cousin/ close cousin, sumptuous dinner లాంటి Collocations గురించి తెలుసుకుందాం. వీటినెలా ప్రయోగించాలో ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం...
Bhanu: He is highly propertied, isn't he?  (అతడు బాగా ఆస్తిపరుడు కదా?)
Praveen: Who do you mean? My cousin, Prakash? Not propertied, as you would say, but richstinking rich. All in cash, and in the stock and share market. They do own a big house but that's all the immovable property they have. (ఎవరి గురించి నువ్వనేదీ, మా cousin ప్రకాష్ విషయమా? నువ్వన్నట్టుగా ఆస్తిపరుడు కాదు, కానీ డబ్బు బాగా మూలుగుతున్నవాళ్లు. అంతా నగదు, stocks and sharesతో పాటు వాళ్లకో పెద్ద ఇల్లుంది. అయితే అదొక్కటే వాళ్లకున్న స్థిరాస్తి.
Bhanu: How are you related?  (మీ ఇద్దరి చుట్టరికం ఏంటి? మీరిద్దరూ ఎలా బంధువులు?)
Praveen: Not very close. He is a distant cousin of mine. What a rich life theylead! They eat and throw sumptuous dinners quite often, and move about in sleek cars. But for all that they are quite nice people. Time was, though in the distant past, when their grandparents were just middle class people, his grandfather doing a small job in government service.(అంత దగ్గరేం కాదు. అతడు నాకు దూరపు చుట్టం. ఎంత ధనిక జీవితం గడుపుతారో వాళ్లు! తరచూ సుష్ఠుగా విందులారగిస్తూ, పెడుతూ ఉంటారు. అందమైన కార్లలో తిరుగుతారు. ఏదేమన్నా ఎంత ఉన్నవాళ్లయినా మంచివాళ్లు. ఎపుడో చాలా పాతరోజుల్లో వాళ్ల తాత, బామ్మలు సాదాసీదా మధ్యతరగతి వాళ్లు. వాళ్ల తాత చిన్న ప్రభుత్వ ఉద్యోగి.)
Bhanu: You know, I notice a close resemblance between Prasad and Kiran.Kiran is also related to you, isn't he?  (ప్రసాద్‌కూ, కిరణ్‌కూ మధ్య చాలా పోలిక కనిపిస్తుంది. కిరణ్‌కూ, నీకూ చుట్టరికం ఉంది కదా?)
Praveen: The resemblance is no surprise. They are first degree cousins. Theirmothers are sisters. But they don't get on well. Either of the sisters picked a quarrel with the other. Their relations broke down. But that was a long time ago, and that soured their relations. I don't see their becoming any close in the near future.(వాళ్ల పోలిక పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. వాళ్లు అతి దగ్గర సంబంధం ఉన్నవాళ్లు. వాళ్ల అమ్మలు అక్కాచెల్లెళ్లు. కానీ వాళ్లకు సత్సంబంధాలు లేవు. వాళ్లల్లో ఎవరో ఇంకొకరితో పోట్లాట పెట్టుకున్నారు. అదెప్పుడోలే, అయితే అది వాళ్ల బంధుత్వాన్ని చెడిపేసింది. వాళ్లు దగ్గరవడం ఇప్పట్లో లేని మాట.)
Bhanu: I heard that Preethi, our schoolmate is a cousin of Prasad too. What is she now?  (మనతో స్కూల్లో చదువుకున్న ప్రీతి కూడా ప్రసాద్ చుట్టమే అట కదా? ఏం చేస్తోంది ఇప్పుడు?)
Prasad: She is doing a course in hotel management in Chennai. How we areindulging in idle gossip!   (చెన్నైలో Hotel Management చేస్తోంది. పనికిరాని కబుర్లతో ఎలా కాలక్షేపం చేస్తున్నామో మనం!)
Bhanu: I can't but agree with you. Let's do something useful.   (కచ్చితంగా. నీతో నేను ఏకీభవిస్తున్నా. ఏదైనా ఉపయోగకరమైన పని చేద్దాం, ఈ కబుర్లాపి)
Notes:
1) Cousin: తల్లిదండ్రుల అక్కా చెల్లెళ్ల, అన్నాతమ్ముళ్ల బిడ్డలు. cousin sister, cousin brother వాడకం సరికాదు. అది Indian English.
2) indulge in = పాలుపంచుకోవడం/ పాల్పడటం - ముఖ్యంగా చెడు విషయాల్లో.
    
indulge in drink = తాగుడు అలవాటుండటం/ తాగుడుకు పాల్పడటం.
వివరంగా...

 Stinking rich -బాగా మూలుగుతున్నంత డబ్బున్న ధనవంతులు. (Stink = కంపు/కంపుగొట్టడం).       
The place is stinking with rotten vegetables = మురిగిపోయిన కూరగాయలతో ఆ చోటు కుళ్లుకంపు కొడుతోంది.
    
a) Pradhan: He seems to have made a lot of money. He is quite rich.
                        (బాగా డబ్బు సంపాదించినట్టుంది. ఇప్పుడు బాగా ధనవంతుడుగా ఉన్నాడు)
       
Praveen: Not just rich. He is stinking rich.
                        (మామూలు ధనవంతుడు కాదు. అతడి దగ్గర డబ్బు బాగా మూలుగుతోంది.)
    
b) Though stinking rich, he is quite mean
          (అతడి దగ్గర డబ్బు బాగా మూలుగుతున్నా, చాలా పిసినారి అతడు, నీచుడు.)        (Miser - పిసినారి)
    
You know it is usually the rich that are miserly (తెలుసు కదా? డబ్బు బాగా ఉన్న వాళ్లే పిసినారులుగా ఉంటారు)

 Related అంటే తెలుసు కదా - బంధువులో చుట్టాలో అవడం/ చుట్టరికం ఉండటం.
     
She is related to him, on her mother's side = అతడికి ఆమె తల్లి వైపు చుట్టం.
     
Relationship = చుట్టరికం.
     
closely related = దగ్గర సంబంధం ఉన్న  ×  distantly related = దూరపు సంబంధం ఉన్న.
     
'Close, distant' collocate with relationship; 'closely, distantly' collocate withrelated.
   
a) Bhavan: I see Mohan and Madan resemble each other.
                       (మోహన్‌కూ మదన్‌కూ దగ్గర పోలికలున్నాయి, గమనించా)
         
Bhargav: Not surprising. They are very closely related.
                           
(అందులో ఆశ్చర్యం ఏం లేదు. వాళ్లిద్దరికీ చాలా దగ్గర చుట్టరికం ఉంది)
        
Susanth: He very often claims that he can get anything done by the minister.
                         (మంత్రిగారి చేత ఏదైనా చేయించగలనని అతడు తరచూ అంటుంటాడు)
        
Prabhat: He claims that he is a relative of the minister, but I know for sure they are only distantly related.
                         (మంత్రిగారి చుట్టానన్ని చెప్పుకుంటాడు గానీ, నాకూ బాగా తెలుసు. వాళ్లు చాలా దూరపు చుట్టరికం కలవాళ్లని)
        
అలాగే cousin కూడా. అన్నదమ్ముల బిడ్డలూ, అక్కాచెల్లెళ్ల బిడ్డల్నే కాకుండా, మేనత్త మేనమామ బిడ్డలు కూడా Englishలో cousins.
        
He married his cousin (తన మేనమామ/ మేనత్త కూతురిని) అతడు పెళ్లి చేసుకున్నాడు.
        
అంటే వరసకు అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు మాత్రమే కాకుండా ఇతర రక్తసంబంధీకులు కూడా cousins.
        
Close cousin (దగ్గర సంబంధం ఉన్న) × distant cousin (దూరపు సంబంధం ఉన్న)
         
ఇవీ cousin కుండే collocations. ఇవి మామూలు సంభాషణలో బాగా వాడొచ్చు.

 Sumptuous (సంప్చు అస్) = చాలా సంపన్నంగా కళ్లకు నిండుగా కనబడే భోజనం/ విందు/ పరిసరాలు/ భవంతులు)
        
a) Sobha: You got up late this morning. Any special reason? (ఇవాళ ఉదయం చాలా ఆలస్యంగా నిద్ర లేచావు నువ్వు. ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?)
             
Keerthi: You are right. Nithya treated us to a sumptuous dinner last night and took us to a movie.
                             
(నువ్వు రైటే. నిన్న రాత్రి నిత్య మాకు మాంచి dinner ఇచ్చి, సినిమాకు తీసుకెళ్లింది.)
       
b) Karthik: What's your dream? (నువ్వు కనే కల ఏంటి?)
            
Jagdish: Living in a big mansion in sumptuous surroundings, eating andthrowing sumptuous dinners)
             
(పెద్ద భవంతిలో జీవిస్తూ, సంపన్నమైన అందమైన పరిసరాల్లో, పసందయిన విందులారగిస్తూ, ఇతరులకు విందులిస్తూ గడపాలని)       గమనించారు కదా! Sumptuous-dinner, meal, neighbourhood/ surroundings/ buildingsతో collocate అవుతుంది.
      
ఈ collocation కూడా గమనించండి.
       
Throw a dinner = ఇతరులకు విందులివ్వడం.
       
He throws a lavish dinner on every birth day = ప్రతి పుట్టినరోజూ చాలా ఖర్చయిన విందు ఇస్తాడతను.
       
Lavish = ఖర్చయిన