COLLOCATIONS - 4

COLLOCATIONS - 4

అర్థం శక్తిమంతంగా వ్యక్తపరిచేందుకు వాడే మాటల కలయిక గురించి తెలుసుకుంటున్నాం కదా? 
ఈసారి ఈ collocations ను- మన నిత్యజీవిత సంభాషణలో వాడేవి- కొన్ని చూద్దాం.
Wesley: What a relief! 
The exams are over at last. I hope to have sound sleep
tonight.
                (ఎంత హాయి! పరీక్షలయిపోయాయి చివరకు. ఈ రాత్రి మంచి నిద్రపోవచ్చు.)

Santhanam: You can say it again and again. You know, the minute I came out of the exam hall, I heaved a big sigh of relief.
                       
(మళ్ళీమళ్లీ అనొచ్చు ఆ మాట నువ్వు. పరీక్ష గదినుంచి బయటికి రాగానే, పెద్ద నిట్టూర్పు విడిచాను తెలుసా, హాయిగా.)

Wesley: Show me one student who likes exams. I just don't understand why exams are given so much importance. No sound reason for it, is there?
              (పరీక్షలంటే ఇష్టపడే విద్యార్థిని ఒక్కడిని చూపించు. పరీక్షలకెందుకంత ప్రాముఖ్యం ఇస్తారో నాకర్థం కాదు. సరైన కారణం ఏమైనా ఉందా?)

Santhanam: If there are people who like them, they must be mentally unsound, I am sure.
                       (పరీక్షలంటే ఇష్టపడేవాళ్లుంటే వాళ్లు మతి తప్పినవారై ఉండాలి.)

Wesley: You know I didn't prepare well enough for the last exam. I had thoughtof resorting to some kind of malpractice and then got over the temptation. I thought I rather fail than resort to such tactics.(చివరి పరీక్షకు నేను సరిగ్గా సిద్ధపడలేదు. ఏదైనా చెడుపనికి పాల్పడదామని అనుకున్నా, కాని ఆ ప్రలోభం నుంచి బయటపడ్డా. అలాంటివి చేసేందుకన్నా పరీక్ష తప్పడం మంచిదనుకున్నా.)
Santhanam: But the paper was easy.(పేపర్ సులభంగా ఉంది కదా.)
Wesley: Easy or not easy, I gave up the thought the minute it came to me
                
(సుఖమో కాదో, ఆ ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని విరమించుకున్నా.)

Santhanam: That was a good thing you did. I appreciate you.
                      
(మంచి పని చేశావు. నిజంగా నేను మెచ్చుకుంటున్నా.)

Wesley: I only kept my promise to my dad.
               
(మానాన్న కిచ్చిన మాట నేను నిలబెట్టుకున్నా.)

చూడండి... ఈ వ్యక్తీకరణల
Now look at the following expressions. 
Notice which word pairs with(collocations with) which other word.
 Sound sleep.
 Sound reason.
 Mentally unsound.
 Resorting to some kind of malpractice.
 Resort to such tactics.

వివరణ ఇదిగో...

i) Sound - దీనికి అత్యంత సాధారణమైన అర్థం శబ్దం అని కదా? 
దాంతోపాటు దీనికి ఇతర అర్థాలూ ఉన్నాయి. అందులో అతిముఖ్యమైంది, 'sound sleep'లో sound అర్థం, 'మంచి/ ప్రశాంతమైన/ గాఢమైన/ మధ్యలో తరచుగా మెలకువ రాని అని.     
a) Politicians pursuing power can never have sound sleep = అధికారం కోసం ఆరాటపడే రాజకీయవాదులు సుఖంగా నిద్ర పోలేరు.     
b) Till I reach my targets I cannot sleep soundly = నా లక్ష్యాలను చేరేవరకు నేను ప్రశాంతంగా నిద్రపోలేదు.
      
'Sound' మరికొన్ని అర్ధాలతో ఇతర మాటలతో collocate అవుతుంది. చూద్దాం!

ii) a) 'Did they tell you why you were not selected?' 'They did. Not one of the reasons they gave was sound'
      
పై conversation లో, sound = convincing/ proper = సబబైన
     
b) 'That you had no vehicle is not a sound reason 
for your absence' నీకు బండి లేదనటం నువు రాకపోవటానికి సరైన కారణం కాదు.

iii) ఈ కింది expressionలో sound = సత్ఫలితం ఇవ్వగల
     
a) 'Why do you go to him whenever there is a 
problem?' 'సమస్య వచ్చినపుడల్లా వాడి దగ్గరకెందుకెళ్తావు?'
        
'He gives sound advice, and he has a sound 
judgment of the situation'
        (అతను సరైన ఫలితాల్నిచ్చే సలహాలు ఇస్తాడు కాబట్టి, చక్కగా పరిస్థితిని అంచనా వేయగలడు కాబట్టి)
     

b) The principal of a college should be a person of sound judgment. (కళాశాల principal కు సరిగ్గా అంచనావేసే శక్తి ఉండాలి.)
iv) Sound = పూర్తిగా తెలిసిన, ముఖ్యంగా ఒక విషయం, పరిస్థితి.
     
a) She has a very sound knowledge of music = సంగీతం బాగా తెలిసిన వ్యక్తి ఆవిడ.
     
b) 'How good is the doctor's Knowledge of 
medicine?' (ఆ డాక్టరుకు వైద్యశాస్త్రం బాగా తెలుసా?)
    
'Not so sound, I'm afraid' (అంత పూర్తిగా లేదనుకుంటా)

v) Sound = గట్టిదనం. దృఢంగా ఉండటం
    
a) 'Is that old building worth Rs 50 lakh?' (ఆ పాతమేడ రూ. 50 లక్షలు చేస్తుందంటావా?)
     
'Though old, the building is still sound' (పాతదయినా, అది బాగా గట్టిది/ నిర్మాణం ఇంకా గట్టిగానే ఉంది.)
     
Sound advice/ judgement/ reason/ Knowledge/ construction - ఇవన్నీ common collocations for 
sound.
     
Sound health = sound ను healthతో కూడా వాడతాం - మంచి ఆరోగ్యం అనే అర్థంతో.
    
a) Because of his daily walk he enjoys sound 
health = రోజూ నడక వల్ల ఆయన మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నాడు.
     
ఇది కూడా చూడండి, వాడండి: A sound mind in a sound body = ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనసు- ఇది best combination for a 
good life.
     
Sound thinking = సరైన ఆలోచన.
    
To get success by hard work is sound thinking = కష్టపడి విజయం సాధించడం అనేది సరైన ఆలోచన.
    
ఇవీ 'sound' తో వచ్చే collocations. Conversation లో 'sound' వాడకం చాలా సహజం అన్పిస్తుంది.
    
అలాగే unsound అంటే సరికాని. గతంలో తెలిపినట్లు, madకు 'పిచ్చి అదే అర్థం ఉన్నప్పటికీ, ఎక్కువగా, 'చాలా కోపం 'చాలా కోపంగా ఉన్నా అనే అర్థాలతో వాడతాం.
     
My father is mad that I am wasting money = నేను డబ్బు వృథా చేస్తున్నానని మా నాన్నకు చాలా కోపంగా ఉంది.
     
'పిచ్చి అనడానికి Englis లో mad కు బదులు ఎక్కువగా 'mentally unsound' అంటారు. 

(sound × unsound)
     
The roof of the building is unsound (భవనం కప్పు దెబ్బ తింది)

vi) Resort = పాల్పడ్డం, ముఖ్యంగా చెడువాటికి.
     
a) Ministers resort to any means to amass 
wealth = సంపద కూర్చుకునేందుకు మంత్రులు దేనికైనా పాల్పడ్తారు.
     
b) unable to bear the loneliness, he resorted to 
drink = ఒంటరితనం భరించలేక తాగుడుకు పాల్పడ్డాడు/ ఎంచుకున్నాడు.
     
c) Politicians resort to all dirty tricks = రాజకీయవాదులు అన్నిరకాల చెడు/ కిటుకులకు పాల్పడతారు.
         
ఇలా resort వాడేటప్పడు కచ్చితంగా to రావాలి.         

He resorted to cheating = మోసానికి పాల్పడ్డాడు.           
 ఇవి మన సంభాషణల్లో వాడతాం.