The Fire Brigade Put out the Fire
(పరీక్షలు మళ్లీ వాయిదా వేయబడ్డాయి (మూమూలు తెలుగులో: వాయిదా వేశారు) - ఇది రెండోసారి కదా! మళ్లీ వాయిదా వేయరని ఆశిస్తున్నా.)
Satish: I am fed up with having to wait for the exams to be over. Once the exams are over, and the results are out, I can take up a job, and be on my own. (పరీక్షల కోసం వేచి ఉండాల్సి రావడం విసుగ్గా ఉంది. పరీక్షలు అయిపోయి ఫలితాలు వస్తే, ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకుని స్వతంత్రంగా ఉండొచ్చు..)
Subhash: I need a job desperately. (నాకు ఉద్యోగం ఎంతో అవసరం.)
Satish: That makes two of us. Dad is just waiting for me to take a job so he can give up his, because of his poor health and doctor's advice.(ఇద్దరం ఒకే పరిస్థితిలో ఉన్నామన్నమాట. నేను ఎప్పుడెప్పుడు ఉద్యోగం తెచ్చుకుంటానా అని మానాన్న ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల, డాక్టరు ఆయన్ను విశ్రాంతి తీసుకోమన్నారు.) |
(ఇది చెత్త పరీక్షా విధానం, ఒక చివరి పరీక్షకే ప్రాముఖ్యం ఇచ్చేలా ఉంది. ఇలాంటి పద్ధతి కాకుండా, విద్యార్థి సామర్థ్యాన్ని పరీక్షించే సరైన పద్ధతిని ఎప్పుడు ప్రవేశపెడతారో తెలియడం లేదు.)
Satish: Not in the near future, I am afraid. We have to wait for a long, long time.(సమీప భవిష్యత్తులో ఉండదనే నేను అనుకుంటున్నా. చాలాకాలం వేచి చూడాలి.)
Look at the following expressions from the conversation above
1) The exams have been put off again.
2) I am fed up with having to wait for the exams to be over.
3) That makes two of us.
4) Dad is waiting for me to get a job so he can give up his
5) I don't know when they will do away with this system.
Notes:1. Once కు మామూలు అర్థం - ఒకసారి.
¤ ఏదైనా గతంలో ఎప్పుడో జరిగిన విషయం గురించి చెప్పేటప్పుడు ''ఒకానొకప్పుడు" అని వాడతాం = Once upon a time.
¤ ఇక్కడి అర్థం - As soon as = వెంటనే.
¤ On one's own - ఎవరంతటవాళ్లే (సొంతంగా), ఇతరుల సాయం లేకుండా - స్వతంత్రంగా - independently. ఇది మంచి idiomatic expression. బాగా నేర్చుకుని మన conversation లో వాడదాం.
I can do it on my own: అది నా అంతట నేనే/ స్వతంత్రంగా చేయగలను.మంచి ఉపయోగకరమైన idiom.
2. Desperately = ఆశంతా కోల్పోయి ఏది చేయడానికైనా సిద్ధంగా ఉండటం.
3. Rotten - అసలు అర్థం : Past participle (v3) of rot = మురిగిపోయిన, కుళ్లిపోయిన
rotten egg = మురిగిపోయిన గుడ్డు; తిట్టడానికి కూడా వాడతాం, very bad అనే అర్థంతో.
4. Usher in = ప్రవేశ పెట్టడం. Usher in a new system = కొత్త పద్ధతి ప్రవేశపెట్టడం.
5. Near future = shortly = సమీప భవిష్యత్‌లో
Now let's (let us) study the phrases and idioms used in the conversation.
1. Put off = Postpone = వాయిదావేయడం. Spoken English లో మామూలు writing లో కూడా, postpone కు బదులు, put off నే ఎక్కువగా వాడతారు. Proverb - సామెత Don't put off till tomorrow what you can do today.(ఇవాళ చేయగలిగినదాన్ని రేపటికి వాయిదా వేయకు.) put off ను lights లాంటివి 'ఆర్పివేయడం' అనే అర్థంతో చాలామంది వాడుతూ ఉంటారు. ఇది సరికాదు. ఆర్పివేయడం = put out. |
The fire brigade put out the fire .( అగ్నిమాపకదళం వాళ్లు మంటలార్పేశారు.)
Put Off:
a) Tarun: Isn't your sister's wedding just a week off? You must be very busy. (మీ చెల్లి పెళ్లికి ఒక వారమే ఉంది కదా! నువ్వు చాలా తీరిక లేకుండా ఉండి ఉండాలే!)
Mohan: No, it had to be put off until next month as the bridegroom's sister was delivered of a child two days ago.(లేదు. అది నెలరోజులు వాయిదా వేయాల్సి వచ్చింది, పెళ్లికొడుకు అక్క రెండు రోజుల కిందటే బిడ్డను ప్రసవించింది.)
b) Niranjan: How do I see you here? Aren't you playing a match today?(ఏమిటి నువ్విక్కడ కనిపిస్తున్నావు? ఈరోజు నువ్వు మ్యాచ్ ఆడటంలేదా?)
Madan: They have put off the match until tomorrow because of the bad whether.(వాతావరణం అనుకూలంగా లేనందున, match రేపటికి వాయిదా వేశారు.)
2. To be fed up with (someone/ something) = Bored or disgusted (with somebody/ something) = విసిగిపోవడం (ఎవరితోనైనా/ దేంతోనైనా).
a) Prakash: You appear to be in a bad mood? (నీ mood బాగున్నట్టు లేదు?) Durga: I've just sat down to study and the power is off. I'm (I am) really fed up with the power cuts.(చదవడానికి కూర్చున్నాను, కరెంటు పోయింది. ఈ కరెంట్ కోతలతో విసుగు పుడుతోంది.) b) Dhanush: How about a Telugu film for a change tonight? |
Dharmendra: To tell you frankly, I am fed up with these Telugu movies. What do you have there? Just four dances and three or four fights.(నిజంగా చెప్పాలంటే తెలుగు సినిమాలంటే విసుగెత్తిపోతోంది. ఏం ఉంది వాటిల్లో, నాలుగు డాన్సులూ, మూడు నాలుగు ఫైట్స్ తప్పించి?)
3. That makes two of us - ఇది మంచి idiom - చాలా ఉపయోగకరమైంది.
I am in the same position as you. ( నా పరిస్థితి నీలాగే ఉంది - మనిద్దరం ఒకే పరిస్థితిలో ఉన్నాం.) a) Farid: I am dead tired after all that work in the office. If only the boss had told us of it earlier, ..... (ఆఫీస్‌లో అంత పనిచేసిన తర్వాత బాగా అలసిపోయాను. Boss దాని గురించి మనకు ముందే చెప్పి ఉండొచ్చు కదా!) Charles: That makes two of us. I am not in a position even to eat something. I feel sleepy. |
b) Ghouse: I am going to the e-seva center to apply for my Aadhar Card. (ఆధార్ కార్డుకు దరఖాస్తు పెట్టుకునేందుకు e - seva కేంద్రానికి వెళుతున్నాను.)
Mani: That makes two of us. I am afraid we have to wait for long hours in the queue. (నేనూ అందుకే వెళుతున్నాను. క్యూలో గంటల తరబడి నిలబడాల్సొస్తుందేమోనని భయంగా ఉంది.)
4. To give up = Stop doing something/ trying for something/ to yield = ఏదైనా చేస్తున్నపని మానేయడం/ వదులుకోవడం/ లొంగిపోవడం.
a) Ganesh: How is Madan? Long since I saw him. When I saw him last he was a bag of bones. (మదన్ ఎలా ఉన్నాడు? చాలా రోజులయ్యింది చూసి. నేనతడిని చివరగా చూసినప్పుడు, బక్కచిక్కిపోయి ఉన్నాడు.) (Bag of bones = ఎముకల గూడు) |
(చాలా మెరుగ్గా ఉన్నాడు. డాక్టరు సలహామేరకు పొగ తాగడం, మద్యం సేవించడం మానేశాడు.)
b) Hemanth: Kanchan hasn't been playing so well as he used to. What could be the reason? (కాంచన్ ఇంతకు ముందులా బాగా ఆడటం లేదు. ఎందువల్ల?)
Hanuman: He has his business to take care of. Actually he wants to give up cricket at the end of this season, and concentrate on business. (అతడు చూసుకునేందుకు అతడి వ్యాపారం ఉంది కదా. అసలు ఈ పోటీల చివర క్రికెట్ మానేసి పూర్తిగా బిజినెస్ మీదే దృష్టి పెట్టాలనుకుంటున్నాడు.)
Give up కు మరో అర్థం stop trying to do something = ప్రయత్నం విరమించుకోవడం.
c) Govind: I've (I have) attempted the civil services exam twice already, but without success. Will I ever succeed? (నేను civil services exams రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యాను. నేనసలు పాసవుతానా?)
Hemanth: You will, of course, if only you have a positive attitude. Don't ever give up. Success will be yours.(తప్పకుండా, నీకు సానుకూల దృక్పథం ఉంటే. ఎప్పటికీ. ప్రయత్నం మానుకోకు. విజయం నీదవుతుంది.)
5. Do away with = Get rid of something/ stop using something/ to put an end to something = అంతం చేయడం/ మానేయడం/ వదిలించుకోవడం.
a) Akshay: Mr.Principal Sir, you burden the kids too much.(ప్రిన్సిపల్‌గారూ మీరు చిన్నపిల్లల మీద విపరీతమైన బరువు మోపుతున్నారు). Principal: What do you mean? (ఏంటి మీరనేది?) Akshay: Why don't you do away with homework and the heavy school bag? (ఆ homework, ఆ బరువైన school bag కు ఎందుకు అంతం పలకరు?/ ఎందుకు మానేయరు?) |
Krishna: Do away with the evil practice of dowry and animal sacrifices.(వరకట్న దురాచారాన్ని, జంతుబలులను అంతం చేయడం).
Do away with somebody కూడా ఉంది. దీని అర్థం చంపేయడం.
They want to do away with the honest officer.(ఆ నిజాయతీ అధికారిని చంపేయాలనుకుంటున్నారు వాళ్లు.)