Showing posts with label Phrases. Show all posts
Showing posts with label Phrases. Show all posts

Idioms & Phrases - 8

Gandhi was always ready to own up to his mistakes

Udai: Please go on, I am listening.
(కానీయండి, నేను వింటున్నాను.)

Sheriff: Towards the end of the day, he owned up his mistake and apologised.(చివరికి తన తప్పును ఒప్పుకుని క్షమాపణ అడిగాడు.) 
Udai: Has he made up for the loss, he has caused to the property?(ఆ ఆస్తికి కలిగించిన నష్టాన్ని పూడ్చాడా?)
Sheriff: He said, he was badly off and could not afford to make up the loss.(తన పరిస్థితి బాగాలేదని, ఆ నష్టాన్ని పూడ్చే స్థోమత లేదని అన్నాడు.) 
Udai: Does it mean that you didn't charge anything from him and let him off the hook?(అంటే దానర్థం, అతడి దగ్గరేం తీసుకోకుండా వదిలేశారా?) 
Sheriff: Yea, that's what happend.(అవును, అదే జరిగింది.) 
Udai: If I had been there, I would have made him pay through the nose.(నేనక్కడ ఉండుంటే ముక్కు పిండి మొత్తం వసూలు చేసేవాడిని.) 
Sheriff: I would have done that too, but that'd have come in the way of finding out the others working with him.(అదికూడా నేను చేసుండేవాడినే, కానీ అతడితో పాటు పనిచేసే వారిని పట్టుకోవడానికి ఆటంకం అవుతుందని వదిలేశా.) 
Udai: Then it's (it is) ok.           అయితే సరే. 

Look at the following expressions from the conversation above 
1)       He owned up his mistakes. 
2)      Has he made up for the loss he has caused.....? 
3)      He said he was badly off. 
4)      Does it mean that you let him off the hook? 
5)      ..... I would have made him pay through his nose. 
6)      ...... but that would have come in the way of finding out the others working with him.
All the expressions underlined above are very useful Phrases and Idioms.(పైవన్నీ కూడా చాలా ఉపయోగకరమైన, ఇంగ్లిష్‌లో తరచుగా వినే Idioms and Phrases.)     
 Let us study them in detail. 

1) Owned up - Past tense of 'own up' = To admit that you have done something wrong = చేసిన తప్పు అంగీకరించడం, దీనికే మరోమాట Confess. 
a) Jayakar: The glass panes of two of the windows of your office are broken. Who did it?(మీ ఆఫీస్ రూమ్ కిటికీ గాజు తలుపులు పగిలిపోయాయి. ఎవరు చేశారా పని?)
 Srinivas: It happened yesterday. I have been trying to find out but no one has owned up to it.
(అది నిన్న జరిగింది. ఇది ఎవరు చేసిన పనా అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఎవరు కూడా దాన్ని ఒప్పుకోలేదు.)

 Jayakar: (Do) You expect people to own up? No one these days are that honest.(చేసిన తప్పును ఒప్పుకునే వాళ్లుంటారని అనుకుంటున్నావా? ఈ రోజుల్లో అంత నిజాయతీపరులెవరూ లేరు.) 
Own up to - 'own up' is always followed by 'to' + a noun/ ....an 'ing' form - 'own up' (చేసిన తప్పు ఒప్పుకోవడం) తర్వాత ఎప్పుడూ 'to' వచ్చి, దాని తర్వాత noun లేదా '..ing' form వస్తుంది. 
b) Brinda: What kind of woman is Sanjana? She appears to be the good sort, doesn't she?(సంజన ఎలాంటిది? మంచి ఆవిడలాగే కనిపిస్తోంది కదా?)(Sort = Kind = రకం) 
Mukta: No body else is more honest than she. She has the courage to own up to any mistake she makes.(ఆమె కంటే నిజాయతీపరులెవరూ లేరు. తను చేసే ఏ తప్పునైనా ఒప్పుకునే ధైర్యం ఆమెకు ఉంది.) 
c) She has owned up to reading my diary.(నా డైరీ చదివినట్లు తను ఒప్పుకుంది.)
Gandhi was always ready to own up to his mistakes. (తను చేసిన తప్పులను ఒప్పుకునేందుకు గాంధీ ఎప్పుడూ సిద్ధమే.) 
¤ own up = చేసిన తప్పు ఒప్పుకోవడం 

గమనించాల్సిన విషయం:
 1) Own up to + mistakes (noun); own up to reading my diary. Own up to + ...ing form గుర్తుంచుకుందాం.
Own up to తర్వాత noun లేదా 'ing' form వస్తుంది. 

1st DW - go, come, sing etc. లాంటివి రావు.
2) To make up for (something) = To compensate for somethingకలిగించిన నష్టాన్ని భర్తీ చేయడం/ చేసిన చెడుకు పరిహారంగా మంచి చేయడం. 
a) Omkar: You are working so hard.(నువ్వు చాలా కష్టపడి పనిచేస్తున్నావు.) 
Narayana: I wasted the whole of last week. Now I am just making up for the time I have lost.(గత వారమంతా సమయం వృథా చేశాను. అలా నష్టపోయిన సమయాన్ని భర్తీ చేస్తున్నాను.) 
b) Ekambaram: You were on leave for more than half of last week. When are you going to finish the work. Very little time left.(గత వారం సగం కంటే ఎక్కువ రోజులు సెలవులోనే ఉన్నావు. పనిని ఎప్పుడు పూర్తి చేయబోతున్నావు? సమయం చాలా తక్కువగా ఉంది.)
Dheeraj: I am going to Make up for the lost time by working beyond office hours.(నష్టపోయిన సమయానికి పరిహారంగా, office hours తర్వాత కూడా పని చేస్తాను.) 
c) You have broken my furniture. Make up for the damage.(నా furniture ను విరగ్గొట్టావు. నష్టాన్ని భర్తీచేయి.) 
3) To be badly off = To be poor  = డబ్బులేకుండా/ పేదరికంలో ఉండటం.
a) Manoj: Why don't you buy that house? You aren't badly off.
(ఆ ఇల్లు నువ్వెందుకు కొనుక్కోకూడదు? నువ్వు పేదవాడివి/ డబ్బు లేనివాడివి కాదు కదా?)
 
Sukumar: I certainly am not badly off, but I can't afford a house like that.(నేనేం పేదవాడిని కాదు, కానీ అలాంటి ఇల్లు కొనుక్కునే స్థితిలో లేను.)(Afford = కొనగల స్థితిలో ఉండటం.)
She can't afford that kind of earstuds.(అలాంటి చెవిదుద్దులు ఆమె కొనేస్థితిలో లేదు.) 
He can afford ten cars like that. 
(అలాంటి పదికార్లు కొనే స్థోమత అతడికి ఉంది.)
ఏదైనా చేస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయేమోనని చేయలేకపోవడం అనే అర్థంతో, not ను ఉపయోగించి  Afford వాడొచ్చు. 
We can't afford to lose any more time.(ఇంకెంత సమయాన్ని మనం కోల్పోలేం - దానివల్ల సమస్యలు వస్తాయి.) 
b) Suman: Long since we met. How is everybody? How is your brother?(కలుసుకుని చాలా కాలం అయ్యింది. అందరూ ఎలా ఉన్నారు? మీ అన్నయ్య ఎలా ఉన్నాడు?) 
Saran: Everybody is ok. The only bad news is that my brother is badly off because of his wrong investments.(అందరూ బాగానే ఉన్నారు. మా అన్నయ్య పరిస్థితే బాగోలేదు, ఆయన పెట్టిన పెట్టుబడులే అందుకు కారణం.)      
Badly off (డబ్బులేని/పేద) × Well of (rich, సంపన్నులైన).      
Two years ago, he was struggling, but now he is well off (rich).      (రెండేళ్ల కిందట అతడు కష్టాల్లో ఉన్నాడు, కానీ ఇప్పుడతడు బాగా ధనవంతుడే.) 
4) Let someone off the hook/ get someone off the hook = Free somebody from a punishment or a difficulty/ help somebody to get out of a difficulty or without punishment.(శిక్షపడకుండా వదిలేయడం/ సమస్య నుంచి బయట పడేయడం.)
 a) Ganesh: Any news of Ramana? He was involved in some case of illegal deals.(రమణ విషయం ఏమైంది? చట్ట విరుద్ధమైన లావాదేవీల్లో ఇరుక్కున్నాడు కదా?) 
Sumanth: His closeness to some minister and that helped to be let off the hook.(ఎవరో మంత్రితో అతడికున్న సాన్నిహిత్యం, అతడికి శిక్షపడకుండా తప్పించింది.)
b) Hemanth: I am surprised to see you at leisure. You were supposed to be busy with the repairs to your house.(నువ్వంత తీరిగ్గా ఉండటం నాకు ఆశ్చర్యంగా ఉంది. మీ ఇంటికి రిపేర్లు చేయించడంలో తీరిక లేకుండా ఉంటావని అనుకున్నా.)
John: I was to, but my brother has agreed to look after that, so that lets me off the hook.(నిజంగా ఉండాల్సిందే, కానీ మా అన్న దాన్ని చూసుకోవడానికి ముందుకొచ్చాడు, అందువల్ల నాకు ఆ పని తప్పింది.) 

5) To make someone pay through the nose/ to pay through the nose = To make somebody too much/ pay too much.
 a) During the Uttarakhand floods, the victims had to pay through the nose even for a glass of water.(ఉత్తరాఖండ్ వరద బాధితులు గ్లాసు నీళ్లకు కూడా ఎక్కువ చెల్లించాల్సి వచ్చింది.) 
b) Janaki: How was the food in that restaurant? (ఆ రెస్ట్రాంట్‌లో పదార్థాలు ఎలా ఉన్నాయి?)
Brinda: They were really good but we had to pay through the nose.(బాగానే ఉన్నాయి, కానీ మేం ఎక్కువ చెల్లించాల్సి వచ్చింది.)
c) If you want to really good lodge, you have to pay through the nose. 
(సౌకర్యాలున్న lodge కావాలంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.)
Note: 
Hotel = A place where you have a lodge/ rooms to stay and an eating place.
Hotel అంటే బస, ఆహారం రెండూ దొరికే చోటు.
 
Restaurant = ఆహారం మాత్రం తినగలిగిన చోటు - (pronunciation: రెస్ట్రాంట్)/ Cafe (pronunciation: క్యఫె). 
6) Come in the way/ Be in the way = Obstruct (అడ్డుపడటం)/ (అడ్డంగా ఉండటం). 
a) Krishna: You don't seem to like your branch manager much.(నువ్వు మీ బ్రాంచ్ మేనేజర్‌ను అంతగా ఇష్టపడుతున్నట్లు లేదు.)
Karim: He has come twice in the way of my promotion. How do you expect me to like him?(రెండుసార్లు నా పదోన్నతికి అతడు అడ్డుపడ్డాడు. ఎలా ఇష్టపడతాను?) 
b) Tarun: Kumar is really a genius. What is in the way of his getting a good degree?(కుమార్ నిజంగా మేధావే కదా? మంచి డిగ్రీ పొందేందుకు ఏం అడ్డం వస్తోంది?)
Vaman: His poverty and his lack of initiative are in the way.(పేదరికం, చొరవలేకపోవడం అతడికి అడ్డుగా ఉన్నాయి.)     
In the way = అడ్డం.     
On the way = దారిలో. 
My home is on the way to the post office.(మా ఇల్లు పోస్టాఫీసుకు వెళ్లే దారిలో ఉంది.)

Idioms & Phrases - 7

HIS JOB IS HIS BREAD AND BUTTER

Snigda: Hi Janani, so you are prepared to go along with Priya's idea of the picnic spot.
(అయితే నువ్వు మనం వెళ్లాలనుకున్న పిక్నిక్ స్థల విషయంలో ప్రియ ఆలోచనలను సమర్థించాలనుకుంటున్నావు కదా?)
Janani: That's because she alone among us knows the places about here. But I am unable to make out why you are all opposing her.(ఇక్కడున్న మంచి ప్రదేశాలన్నీ తనకు తెలుసు. మీరందరూ తనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో నాకర్థం కావడం లేదు?)
Snigda: Do you know something? On the way to the spot she suggests, there are many traffic jams and that can rob us of our precious time.(నీకో విషయం తెలుసా? తను సూచిస్తున్న స్థలానికి వెళ్లే దార్లో ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఎక్కువ, మనం వాటివల్ల విలువైన సమయం కోల్పోతాం.) 
Janani: Have you a better choice? If you have, come out.(నీకు అంతకంటే మెరుగైన ఎంపిక ఉందా? ఉంటే చెప్పు) 
Snigda: I am in a hurry now. There's still time, isn't there? Let's come back to it when we meetnext, I will see you in a day or two.(నేను తొందరలో ఉన్నాను. ఇంకా సమయం ఉంది కదా? మళ్లీ మనం కలుసుకున్నప్పుడు దాని గురించి చర్చించవచ్చు. ఒకటి రెండు రోజుల్లో మనం మళ్లీ కలుసుకుందాం.) 
Note: Spot = స్థలం/చోటు. (ఇంకో అర్థం మచ్చ)- 
The spots on the moon = చంద్రుడి మీది మచ్చలు 
Know the places about = పరిసరాల్లో ఉన్న చోట్లు.

 Look at the following expressions/phrasal verbs from the conversation above.    
1) You are prepared to go along with Priya.    
2) But I am unable to make out, why you are all .........    
3) If you have, come out.    
4) Let's come back to it when we have the time. 
1) Go along with = To agree with somebody or something= ఒకరితో ఏకీభవించడం/ ఒక విషయాన్ని అంగీకరించడం.
a) Vinay: I find it difficult to see your point. Will it be possible for him to carryout the job all by himself?
(నువ్వు చెబుతున్న విషయం అర్థం చేసుకోవడం నాకు కష్టంగా ఉంది.
(ఇక్కడ see = understand) ఒంటరిగా అతడికి ఈ పనిచేయడం సాధ్యమేనా?). 
Roopa: I go along with you there. Of course, do it he must, but he needs someone to help him.(ఆ విషయంలో నీతో నేను ఏకీభవిస్తున్నాను. అయితే ఈ పని అతడే చేయాలి, కానీ అతడికి ఎవరో ఒకరి సాయం అవసరం). 
b) Gajanan: Why don't you try to understand? What I suggest is free from all trouble?(అర్థం చేసుకోడానికి ఎందుకు ప్రయత్నించవు? నేను సూచిస్తుంది ఇబ్బందులేమీ ఉండని మార్గం). 
Vikas: I am prepared to go along with you upto the point that it is uncomplicated, but my point is that it takes a long time and more money.(అది ఇబ్బందులేం లేని మార్గం అనేంతవరకు నేను నీతో అంగీకరిస్తాను, కానీ నేను చెప్పేదేంటంటే అది చాలా సమయం పట్టేది, డబ్బు ఖర్చేయ్యేదిగా ఉంది). 
2) To make out = Understand (అర్థం చేసుకోవడం) 
a) Sunil: See the way she behaves towards me. Very unfair, isn't it? Why is she annoyed?(ఆమె నా పట్ల ఎలా ప్రవర్తిస్తోందో చూడు. చాలా అన్యాయం, కదా? తను ఎందుకు కోపంగా ఉంది?)
Bhavan: She is rather odd. I just can't make her out all.(ఆమె కాస్త విచిత్రమైందే. ఆమెను నేను అసలర్థం చేసుకోలేను.) 
b) Srinivas: Your information was wrong. What you told me was way off from what was in the letter, she told me.
(నీ సమాచారం తప్పు, నువ్వు చెప్పిందానికి, ఆ ఉత్తరంలో ఉన్నదానికీ చాలా తేడా ఉందని ఆమె చెప్పింది.)
Amar: Well, that's what I could make out of her handwriting. Such a beautiful hand she writes!(సరే ఆమె చేతిరాత నేనర్థం చేసుకున్నదదీ, ఆమె రాత! అంత అందంగా ఉంటుందన్నమాట) 
3) Come out with something = To say something surprising/ suddenly= ఏదైనా కొత్త విషయం/ అనుకోని విషయం ఉన్నట్టుండి బయటపెట్టడం. 
a) Hanuman: There is no end to the surprises from Jayanth.(జయంత్ చెప్పే ఆశ్చర్యాలకు అంతే లేదు). 
Tarun: Why do you say that?(ఎందుకంటున్నావ్ ఆమాట?) 
Hanuman: Just last night he came out with the story that Usha had had a child by an earlier marriage.(నిన్న రాత్రి అంటే నిన్న రాత్రే, ఇంతకుముందే జరిగిన పెళ్లి వల్ల ఉషకొక బిడ్డ పుట్టిందన్న విషయాన్ని బయట పెట్టాడు.)
b) Bhaskar: Sunil really has a bad tongue.(సునీల్ ఓ తిట్లపుట్ట). 
Sudhakar: You are right. He often comes out with abuses.(నువ్వు కరెక్టే. అతడు తరచూ అందరినీ తిట్టి పారేస్తుంటాడు/ ఉన్నట్లుండి తిట్లు మొదలుపెడతాడు).
4) Come back to something = Discuss something once again= ఒక విషయాన్ని మళ్లీ చర్చించడం. 
a) Sunath: Anand tires me, you know.(ఆనంద్ నాకు విసుగు కలిగిస్తాడు).
Prasanth: He tires me too. He often comes back to the same subject again and again.(తరచూ నన్ను కూడా విసిగిస్తాడు. అంతా అయిన తర్వాత మళ్లీ మళ్లీ అదే విషయానికి వస్తాడు.)
b) Madhu: Do you see my point?(నేను చెప్పింది అర్థమైందా?)
Chitra: I am in a hurry. I have other things to attend to now. Can't we come back to it sometime later?
(నేను చాలా తొందర్లో ఉన్నా. చేయాల్సిన ఇతర పనులున్నాయి. ఈ విషయం గురించి ఇంకెప్పుడైనా చర్చిద్దామా?) 
II. Idioms అంటే తెలుసు కదా? 
A group of words, the meaning of which has no connection with the meaning of any word in the group. 
Idiom = కొన్ని మాటల సమూహం - ఆ సమూహానికి ఉండే అర్థానికీ, సమూహంలోని ఏ మాట అర్థానికీ సంబంధం ఉండదు.
మాతృభాషగా ఉన్నవాళ్లకు తప్ప ఇతరులకు మరో భాషలోని idioms అర్థం కావు, ప్రత్యేకంగా నేర్చుకుంటే తప్ప.
     తెలుగులో ఒక idiom తీసుకుందాం.     కాలికి బుద్ధి చెప్పడం. దీనర్థం - 'పారిపోవడం'.
'పారిపోవడానికి' 'కాలికి బుద్ధి చెప్పడం' అనే జాతీయం/ నానుడి (proverb) అర్థానికీ సంబంధం లేదు.
 
అలాగే English లో "Off Colour" అనే idiom చూద్దాం.
 Off Colour = Feeling unwell= ఒంట్లో సరిగా లేకపోవడం.Off కు, Colour కు, ఆరోగ్యం సరిగా లేకపోవడానికీ సంబంధం లేదు కదా.This is one example of an idiom. 
Let's now see a few idioms in use. Read the followng conversation: 

Vinod: Why doesn't he give up that tough job? It involves night duties and late night shifts.(అంత కష్టమైన ఉద్యోగాన్ని ఎందుకు చేస్తున్నాడు అతడు? దానివల్ల రాత్రివేళల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది, late night shifts చేయాల్సి ఉంటుంది.)
 Krishna:   Well, that's (that is) his bread and butter.(ఏం చేయగలడు? అదే అతడి జీవితం.) 
Vinod:  Further, all his attempts to get another job have been of no avail, so he has to make do with his present job atleast for some time to come.(అంతేకాకుండా మరో ఉద్యోగానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అందువల్ల ఆ ఉద్యోగంతోనే సర్దుకుపోవాలి). 
Vinod:  His Uncle from America has taken interest in him. He may do something for him.(అతడి విషయంలో వాళ్ల మామయ్య శ్రద్ధ తీసుకున్నాడు. ఆయనేదైనా చేయొచ్చతడికి). 
Krishna: Let's wait and see. (సరే చూద్దాం.) 

Notes:  
1. Give up = Leave (వదులుకోవడం)             
2. Make do with = సర్దుకుపోవడంLet's make do with what we have.(మనకున్నదాంతో సర్దుకుపోదాం.) 
¤ Give up = Stop/discontinue = మానుకోవడం. దీని గురించి ఇంతకుముందు చాలాసార్లు చూశాం. 

Now look at the following idioms. 
1) His job is his bread and butter = His job is his living= ఉద్యోగమే అతడి జీవనాధారం/జీవనం.
a) Bread and butter is hard to get by now a days.(ఈ రోజుల్లో జీవించడం(ఆహారం దొరకడం) కష్టమైపోయింది.) 
Hard to get by = దొరకడం కష్టం (ఇది కూడా idiom). 
b) Bread and butter is what everyone earns for.(ఎవరైనా పనిచేసేది నాలుగు మెతుకుల కోసమే కదా.)
2) Of no avail = Fruitless (నిష్ఫలం) = Useless (నిరుపయోగం). 
a) Chandana: What did your father say? Could you prevail upon him to buy you that necklace?(మీ నాన్న ఏమన్నారు? ఆ నగ కొనడానికి అంగీకరించేలా అతడికి నచ్చజెప్పావా?)
Vineela: All my efforts to make him to buy the necklace were of no avail.(మా నాన్నతో ఆ నెక్లెస్ కొనిచ్చేందుకు నేను చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయిపోయాయి.) 
b) Mukund: What happend to the people connected with the 2G Scam?(2G Scam తో సంబంధం ఉన్న నాయకుల విషయం ఏమైంది?)
Samad: All the efforts of the politicians to fix the PM in the matter have been of no avail.(ప్రధానమంత్రిని స్కామ్ లో ఇరికించేందుకు రాజకీయ నాయకులు చేసిన ప్రయత్నాలు వృథా అయ్యాయి.)

Idioms & Phrases - 6

HE IS UPTO HIS NECK IN THE 2G SCAM

Mukund: Subodh has made a mess of the whole job. Whoever asked him to do it?(సుబోధ్ పని మొత్తాన్ని గందరగోళం చేశాడు. అసలు అతడిని ఆ పని ఎవరు చేయమన్నారు?) 
Srinivas: He offered to do it. I didn't come in his way because he appeared itching to do it. I never thought he would botch up the wholething.
(ఆ పని చేసేందుకు అతడే ముందుకొచ్చాడు. చేయాలని ఉబలాటపడుతుండటంతో నేనూ అడ్డుపడలేదు. ఇలా పాడుచేస్తాడని అనుకోలేదు.) 
Mukund: I had been looking forward to impressing the visitors with our skill at and mastery over such things. Now I just don't know what to do.(కానీ సందర్శకులను అలాంటి విషయాల్లో మన నైపుణ్యం, పట్టుతో మెప్పించాలనుకున్నాను. ఇప్పుడు అసలు ఏం చేయాలో తెలియడం లేదు.) 
Srinivas: Don't worry. We still have the time to complete it and make it ready by the time the visitors arrive.(బాధపడకు మనకింకా టైం ఉంది, సందర్శకులు వచ్చేలోగా దాన్ని మళ్లీ రెడీ చేద్దాం.) 
Mukund: But what about the money? Where do we get so much money from? It is beyond my means.(డబ్బు విషయం ఏంటి? మనకంత డబ్బు ఎక్కడ్నుంచి వస్తుంది? ఇది నా తాహతుకు మించిపోయింది.) 
Srinivas: Don't worry. Let's together put our money into it. We'll go shares in the profits in the end.(బాధపడకు. ఇద్దరం కలిసి పెట్టుబడి పెడదాం. చివరకి వచ్చే లాభాలు పంచుకుందాం.) 
Mukund: Thank you. 

Look at the following sentences from the conversation above       
1) Subodh has made a mess of the whole job.       
2) I didn't come in his way.       
3) I had been looking forward to impressing the visitors.       
4) ....... because he was itching to do it.       
5) It is beyond my means. 

Notes:
1. Job = Usual meaning = Employment/ Profession.Meaning here = The work a person has to do. (మనం చేయాల్సిన పని = work) -
I have the job of receiving our guests at the station.
స్టేషన్‌కు వెళ్లి మా అతిథులను తీసుకురావలసిన పని ఉంది నాకు.

Mom has the job of cleaning the kitchen every day.(అమ్మకు రోజూ వంటింటిని శుభ్రం చేయాల్సిన పని ఉంటుంది.)
 2. Offer to do something = Be willing to do something without others asking you to do it   = ఇతరులు అడగకుండానే ఏదైనా చేసేందుకు ముందుకు రావడం  = Come forword to .... 
3. Impress = మెప్పించడం/ సదాభిప్రాయం కలిగించడం.
Now Let's study the phrases/ idioms above, one by one.
1. Made a mess of - Past tense of make a mess = Do something badly    = Spoil      = పాడు చేయడం. 
a) Vishnu: Vinod do you remember him? He was the captain of our cricket team at school.(వినోద్ నీకు గుర్తుందా? అతడు మన స్కూల్ క్రికెట్ టీమ్‌కి కెప్టెన్‌గా ఉండేవాడు.)
Shanmukh: Yea. I do. He made a mess of his life, running after a career in movies.
(అవును. గుర్తున్నాడు. సినిమాల్లో చేరాలనే తపనతో జీవితం పాడు చేసుకున్నాడు.)
 

b) The Government has made a mess of Engineering and Medicine admissions this year. (ప్రభుత్వం ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల వ్యవహారంలో మొత్తం గందరగోళం సృష్టించింది.) 
Make a mess of = In a mess
= అంతా పాడైన/ గందరగోళ స్థితిలో/ అయోమయంలో ఉండటం.        
Professional course admissions this year is in a mess = ఈ ఏడాది వృత్తి విద్యాకోర్సుల ప్రవేశాలన్నీ గందరగోళ స్థితిలో ఉన్నాయి. (ప్రభుత్వం పాడు చేసింది.) 
Mess = కంగాళీగా/అసహ్యంగా/ గందరగోళంగా ఉండటం          
The kitchen is in a big mess. Let me clean it up   (వంటగది అంతా గందరగోళంగా ఉంది. శుభ్రం చేయాలి.) 
2. TO COME/ be in somebody's way = Obstructing = అడ్డంగా ఉండటం/ అడ్డుపడటం.
 a) Ayush: Why are you so much against my contesting the elections?          (నేను ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నువ్వెందుకు అంత వ్యతిరేకిస్తున్నావు?)
Sravan: Who is in your way? Go ahead. Contest and be left a broke.(నిన్నెవరు అడ్డగిస్తున్నారు? కానీ, పోటీ చేసి దివాలా తీయి. - Broke = దివాలా)
 b) India cannot have peace along its borders. Pakistan and China are in its way.(భారత సరిహద్దుల వెంబడి ప్రశాంతత ఉండటం లేదు. పాకిస్థాన్, చైనా అందుకు అడ్డుపడుతున్నాయి.)
c) Chinna: He is quite intelligent. Why isn't he able to get any job?
(అతడు తెలివిగలవాడేకదా. ఏ ఉద్యోగమూ ఎందుకు పొందలేకుండా ఉన్నాడు?)
 Seenu: His laziness is in the way.(అతడి బద్దకం అడ్డుపడుతోంది.) 
3. Look forward to: Wait eagerly for a good thing/ happening.(జరగబోయే మంచి కోసం ఆత్రుతతో ఎదురు చూడటం.) 
a) Asrai: How did you do in the interview yesterday?(నిన్న ఇంటర్వ్యూలో ఎలా చేశావు?) 
Akash: Well enough to be selected. I am looking forward to the appointment order.(ఎంపికయ్యేంత బాగా చేశాను. అపాయింట్‌మెంట్ లెటర్ కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నా.)
b) Prasanth: What are your ideas about your future?(భవిష్యత్ గురించి నీ ఆలోచనలేంటి?)
 Subhash: I am looking forward to getting my pilot's licence and flying a plane.(నా పైలట్ లైసెన్స్ కోసం, Plane ను నడపడానికి ఉవ్విళ్లూరుతున్నాను.)
          Look forward to is always followed by a noun/ ...ing form.          
We are looking forward to the release of our favourite hero's movie.          (మా అభిమాన నటుడి చిత్రం విడుదల కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నాం.)          

Look forward to the release (noun)          
We are looking forward to seeing the movie.          
Look forward to + '....ing' form. 

4. Be itching to do something/ be itching for something = Desiring strongly to do something.(ఏదైనా చేయాలనే బలమైన కోరిక.)
 a) Bhaskar: You know Omkar has been badly injured?(నీకు తెలుసా, ఓంకార్‌కు చాలా బలమైన గాయాలయ్యాయి.) 
Sekhar: I know. He had been itching to drive a car even before he could drive well, and it's not surprising he got injured.(తెలుసు. పూర్తిగా డ్రైవింగ్ నేర్చుకోకుండానే, నడపాలనే బలమైన కోరిక అతడిది. అందుకనే గాయాలు. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు.) 
b) Prasanna: Our classmate Dr. Ram has set up practice in town.(మనక్లాస్‌మేట్ డాక్టర్ రామ్ తన ప్రాక్టీస్‌ను సిటీలో ప్రారంభించాడు.) 
Susanth: I know, and I know as well he is itching to do his first operation.(నాకు తెలుసు. ఇంకా మొదటి ఆపరేషన్ ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఉబలాటపడుతున్నాడు.)
Itch = దురద.
To be itching = దురదగా ఉండటం - ఉబలాటపడటం.

 c) They are itching to play their first game.
(వాళ్లు మొదటి ఆట ఆడాలని ఉబలాటపతున్నారు.)
 

5. Beyond somebody's means = More than somebody can afford
     = ఒకరి తాహతుకు మించిన.
a) Ananth: I saw Sri Ram driving. Looks like he has bought one.
(శ్రీరామ్ కారు నడపటం నేను చూశాను. కారు కొన్నట్లున్నాడు.)
Basha: How can that be? A car is beyond his means at this stage.

(అదెలా సాధ్యం? ప్రస్తుత పరిస్థితుల్లో కారు అతడి తాహతుకు మించిన విషయం.)
 

b) Anup: Sumanth's father has sold off his house and is searching for a rented place.(సుమంత్ వాళ్ల నాన్న తన ఇంటిని అమ్మేసి అద్దె ఇంటికోసం వెతుకుతున్నాడు.)
Pattabhi: That is what comes from living beyond your means. He had borrowed huge sums of money that his style of life demanded.  


Upto his neck in debts, he was forced to sell off his house. The worse is yet to come.(మన తాహతుకు మించి జీవిస్తే అదే జరుగుతుంది. ఆయన జీవనశైలికి చాలా డబ్బు కావలసి వచ్చింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి, బలవంతాన ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. దీంతో అయిపోలేదు. ఇంతకంటే చెడు ఇంకా జరగనుంది.)         
Beyond somebody's means (ఒకరి తాహతుకు మించిన) 
× Within one's means (ఒకరి తాహతుకు లోబడి).        
Living within your means keeps you happy and ensures peace of mind = మన తాహతుకు తగిన విధంగా బతకడం (సంతోషంగా, మనశ్శాంతితో). 
It is beyond my means = It is not within my means     = నా తాహతుకు మించింది/ నా తాహతుకు లోబడిలేదు. 
ఇది కూడా నేర్చుకుందాం:
       
Upto one's neck = Be deeply involved in a) some work b) trouble (పీకల్లోతు మునిగి ఉండటం - తీరికలేని పనివల్ల గానీ, కష్టాలు, అప్పుల్లోగానీ.)
 a) Sorry, I can't come with you to a movie. I am up to my neck with this work.(క్షమించు. నేను సినిమాకు రాలేను. పీకల్లోతు పనిలో మునిగిపోయి ఉన్నాను.) 
b) He is upto his neck in the 2G scam.(అతడు 2G కుంభకోణంలో పీకల్లోతు మునిగి ఉన్నాడు.)

Idioms & Phrases - 5

I haven't breathed a word of it!

Murali:
Could you meet me this evening? We can sit together and work out a solution to the problem.
(ఈ రోజు సాయంత్రం నువ్వు నన్ను కలుస్తావా?మనం ఇద్దరం కూర్చొని ఆ సమస్యకు ఏదైనా పరిష్కారాన్ని చూద్దాం.)
Vinod: Certainly. The earlier we end the problem the better. Did you bring up this topic with Murthy? He was asking me about it this morning.(ఇది ఎంత త్వరగా సమసిపోతే అంత మంచిది. ఈ విషయాన్ని మూర్తితో ఏమైనా ప్రస్తావించావా? ఈ రోజు ఉదయం అతడు నన్ను అడిగాడు.)
Murali: I haven't breathed a word about it to anyone. We have decided to keep it under wraps and I have stick to the idea.(ఈ విషయం గురించి ఎవరికీ ఏమీ చెప్పలేదు నేను. మనం దాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నాం. నేను దానికి కట్టుబడి ఉన్నాను.)
Vinod: I ran into Murthy on my way to office. He stopped me and raised the topic. I almost told him not to poke his nose into things that didn't concern him. With great difficulty could I hold myself back.(నేను ఆఫీస్‌కి వెళుతూ మూర్తిని చూశాను. నన్ను ఆపి ఈ విషయం గురించి అడిగాడు. అతడికి సంబంధం లేని విషయాల్లో తలదూర్చొద్దన్నన్నాను. అతికష్టం మీద వెనక్కి తగ్గాను.)
Murali: Yea, he is very nosy. It is better to leave him alone. Let's play safe.(అవును. అతడికి ఆరాలు తీసే అలవాటు ఎక్కువ. అతడి మానాన అతడిని వదిలేయడం మంచిది, ప్రమాదం లేకుండా.)
Vinod: That's what I thought too. Once we get over with the whole thing, it doesn't matter who comes to know of it.(నేనూ అదే అనుకున్నా. ఇది ముగింపునకు వస్తే, తర్వాత ఎవరికి తెలిసినా ఫర్వాలేదు.)
Murali: Let's meet in the evening. (సాయంత్రం కలుద్దాం.)                   
Look at the following expressions from the conversation above       
1. Work out a solution to the problem.       
2. Did you bring up this topic ........?       
3. I haven't breathed a word of it.       
4. I ran into Murthy.       
5. I almost told him not to poke his nose into things.       
6. With great difficulty could I hold myself back.       
7. Let's (Let us) play safe.

1. Work out = Find a solution to a problem = సమస్యకు పరిష్కారం కనుక్కోవడం
Work out a problem = Find a solution అని కూడా అంటాం.
a) Bhaskar: We are caught in a big problem. How to get out of it?
                     
(మనం పెద్ద సమస్యలో చిక్కుకున్నాం. బయటపడటం ఎలా?)
Chitra: Let's sit together and study it. We can work it out.  (కూర్చొని పరిశీలిద్దాం. ఏదో విధంగా పరిష్కారం కనుక్కోగలుగుతాం.)
b) Anwar: You haven't yet worked out how we are going to travel without reservation, have you?(రిజర్వేషన్ లేకుండా మనం ఎలా ప్రయాణించబోతున్నామనే దానికి పరిష్కారం ఏమైనా కనుక్కున్నావా?)
Sahir: I have, of course. I know some one in the railways and he has promised to help.(నేను కనుక్కున్నా. రైల్వేలో నాకు తెలిసినవారు ఒకరున్నారు. ఆయన సాయం చేస్తానని మాటిచ్చాడు.)     
"Work out" has other meanings too:
1) Things do not always work out the way we wanted them to = అన్ని విషయాలూ మనం అనుకున్నట్లుగా జరగవు.
2) Work out = Understand (someone's character) = ఒకరిని అర్థం చేసుకోవడం
He hasn't been able to work her out, though he has been with her for ten years.(అతడు ఆమెతో పదేళ్లుగా ఉంటున్నా, ఆమెను అర్థం చేసుకోలేకపోతున్నాడు.)
Work out = Calculate = లెక్కపెట్టడం
He worked it out and found we need Rs.10000.(అతడు లెక్కపెట్టాడు. మనకు రూ.10000 అవసరమని తేల్చాడు.)
2. Bring up a topic = ఒక విషయాన్ని లేవనెత్తడం/ ప్రస్తావించడం
a) Sunanda: We were discussing plans for future and she suddenly brought up the topic of your marriage.(మేం భవిష్యత్తు గురించి చర్చిస్తుంటే ఆమేమో నీ పెళ్లి విషయాన్ని ప్రస్తావించింది.)
Vasantha: Why did she do it? I told her not to bring up such matters.(ఆమె అలా ఎందుకు చేసింది? నేను ఆమెకు అలాంటి విషయాలు ప్రస్తావించవద్దని చెప్పాను.)
b) Chandra: Whatever the topic of discussion, he always brings up the topic of movies.(మనం చర్చిస్తున్నది ఏ విషయమైనా... అతడు సినిమా విషయాన్ని లేవనెత్తుతాడు.)
Tarun: I'll (I will) warn him not to.(అలా చేయొద్దని అతడిని హెచ్చరిస్తాను.)
3. Breathe a word of something: రహస్యాన్ని బట్టబయలు చేయడం. ఎక్కువగా దీన్ని "not"తో అంటే రహస్యాన్ని బయట పెట్టవద్దు అనే అర్థంతో వాడతాం.
a) Ramesh: His coming here is a top secret. Don't let it out.(అతడు ఇక్కడికి రావడం అత్యంత రహస్యమైన విషయం. దాన్ని బయటపెట్టకు.)
Supriya: I will not breathe a word about it to anyone.(దాని గురించి ఎవ్వరికీ ఒక్క మాట కూడా చెప్పను.)
b) Prasad: Didn't they know it?(వాళ్లకది తెలియదా?)
Kumar: They had known it all along, but they did not breathe a word of it to anybody, the rogues.(వాళ్లందరికీ ఎప్పటినుంచో తెలుసు. కానీ దాని గురించి ఎవరితోనూ ఒక్క మాట కూడా అనలేదు దుర్మార్గులు.)
4. Ran into somebody - Past tense of Run into somebody= అనుకోకుండా ఎవరినైనా కలుసుకోవడం = Meet somebody unexpectedly.
a) Subba Rao: You are all smiles. What is the matter?(నీ మొహం నిండా చిరునవ్వు? ఏంటి సంగతి?)
Sekhar: I ran into a childhood friend of mine on my way here. A joke he made is what causes the smile.(ఇక్కడికి వచ్చే దారిలో నా బాల్యమిత్రుడు కనిపించాడు. వాడు వేసిన జోక్ నాకు ఇంకా నవ్వు తెప్పిస్తోంది.
b) Mani: Hi Gopal, What's news?(హాయ్ గోపాల్... ఏంటి విశేషాలు?)
Sankar: Look at this news here. Jumping out the window of the house where he had stolen jewellery, the thief ran into a constable on duty.(ఈ వార్త చూడు. నగలు దొంగిలించిన ఇంటిలోంచి దూకి, బయటకు వస్తూ ఈ దొంగ పోలీసు కానిస్టేబుల్‌కే తటస్థపడ్డాడు.)
5. Poke one's nose into others' affairs: ఇతరుల విషయాల్లో తలదూర్చడం.
a) Ravi: Where were you yesterday?(నిన్న నువ్వు ఎక్కడున్నావు?)
Nagaraj: Why do you want to know?
Don't poke your nose into my affairs, I warn you.
(నీకెందుకు? నా విషయాల్లో తలదూర్చకు. నీకు గట్టిగా చెబుతున్నా.)

b) Hanuman: You had better tell your friend to keep off me.(నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని నీ స్నేహితుడితో చెప్పు.)
Siva: Why? What happened?(ఎందుకు? ఏమయ్యింది?)
Hanuman: He enquired of my cousin how much property I have. How's he interested? Let him not poke his nose into my matters.(నాకు ఎంత ఆస్తి ఉందని మా కజిన్‌ను అడిగాడట. అతడికి అంత ఆసక్తి ఏంటి? నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పు.)
6. Hold oneself back = Control oneself = మనల్ని మనం అదుపులో ఉంచుకోవడం.
a) Manoj: Why were you quiet when Suraj was banging you so awfully?(సూరజ్ నిన్నలా తిడుతుంటే ఎందుకు ఊరుకున్నావు?)     
Banging = దులిపేయడం.
Niraj: I felt like bashing his head against the wall. But I held myself back because I did not want to make a scene in public.(అతడిని గోడకేసి కొట్టాలనిపించింది. కానీ నన్ను నేను తమాయించుకున్నా. అందరి ముందూ పెద్ద గొడవను సృష్టించడం ఇష్టంలేక ఊరుకున్నా.)
b) Shanmukh: You are lucky. The auto driver was good enough to return your money back to you.(నువ్వు నిజంగా అదృష్టవంతుడివి. ఆటో డ్రైవర్ నీ డబ్బును నీకు తిరిగి తెచ్చిచ్చాడు.)
Sarath: Really. He held himself back from keeping the money for himself.(నిజమే. అతడు డబ్బు తీసుకోకుండా, నిగ్రహం ప్రదర్శించాడు. గొప్పవాడే.)
7. Play Safe = Not to take risks (రిస్క్ తీసుకోకుండా ఉండటం.)
a) Ramesh: Why does the government have the food security bill in the PARLIAMENT?(ప్రభుత్వం ఆహార భద్రతా బిల్లును పార్లమెంటులో ఎందుకు చర్చకు తేవడంలేదు?)
Surya: The government wants to play safe as the opposition parties may not accept it in its present form.)(ప్రభుత్వం ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనుకుంటోంది. ప్రతిపక్షాలు ఆ బిల్లును ప్రస్తుతమున్న రూపంలో వ్యతిరేకిస్తున్నాయి.)
b) Sujana: How about going by train?(రైల్లో వెళితే ఎలా ఉంటుంది?)
Anushka: We have to risk of not being able to reach on time. Let's play safe by taking a taxi.(అక్కడికి సకాలానికి చేరలేకపోయే ప్రమాదం ఉంది. రిస్క్ లేకుండా టాక్సీలో వెళదాం.)