Idioms & Phrases - 6

HE IS UPTO HIS NECK IN THE 2G SCAM

Mukund: Subodh has made a mess of the whole job. Whoever asked him to do it?(సుబోధ్ పని మొత్తాన్ని గందరగోళం చేశాడు. అసలు అతడిని ఆ పని ఎవరు చేయమన్నారు?) 
Srinivas: He offered to do it. I didn't come in his way because he appeared itching to do it. I never thought he would botch up the wholething.
(ఆ పని చేసేందుకు అతడే ముందుకొచ్చాడు. చేయాలని ఉబలాటపడుతుండటంతో నేనూ అడ్డుపడలేదు. ఇలా పాడుచేస్తాడని అనుకోలేదు.) 
Mukund: I had been looking forward to impressing the visitors with our skill at and mastery over such things. Now I just don't know what to do.(కానీ సందర్శకులను అలాంటి విషయాల్లో మన నైపుణ్యం, పట్టుతో మెప్పించాలనుకున్నాను. ఇప్పుడు అసలు ఏం చేయాలో తెలియడం లేదు.) 
Srinivas: Don't worry. We still have the time to complete it and make it ready by the time the visitors arrive.(బాధపడకు మనకింకా టైం ఉంది, సందర్శకులు వచ్చేలోగా దాన్ని మళ్లీ రెడీ చేద్దాం.) 
Mukund: But what about the money? Where do we get so much money from? It is beyond my means.(డబ్బు విషయం ఏంటి? మనకంత డబ్బు ఎక్కడ్నుంచి వస్తుంది? ఇది నా తాహతుకు మించిపోయింది.) 
Srinivas: Don't worry. Let's together put our money into it. We'll go shares in the profits in the end.(బాధపడకు. ఇద్దరం కలిసి పెట్టుబడి పెడదాం. చివరకి వచ్చే లాభాలు పంచుకుందాం.) 
Mukund: Thank you. 

Look at the following sentences from the conversation above       
1) Subodh has made a mess of the whole job.       
2) I didn't come in his way.       
3) I had been looking forward to impressing the visitors.       
4) ....... because he was itching to do it.       
5) It is beyond my means. 

Notes:
1. Job = Usual meaning = Employment/ Profession.Meaning here = The work a person has to do. (మనం చేయాల్సిన పని = work) -
I have the job of receiving our guests at the station.
స్టేషన్‌కు వెళ్లి మా అతిథులను తీసుకురావలసిన పని ఉంది నాకు.

Mom has the job of cleaning the kitchen every day.(అమ్మకు రోజూ వంటింటిని శుభ్రం చేయాల్సిన పని ఉంటుంది.)
 2. Offer to do something = Be willing to do something without others asking you to do it   = ఇతరులు అడగకుండానే ఏదైనా చేసేందుకు ముందుకు రావడం  = Come forword to .... 
3. Impress = మెప్పించడం/ సదాభిప్రాయం కలిగించడం.
Now Let's study the phrases/ idioms above, one by one.
1. Made a mess of - Past tense of make a mess = Do something badly    = Spoil      = పాడు చేయడం. 
a) Vishnu: Vinod do you remember him? He was the captain of our cricket team at school.(వినోద్ నీకు గుర్తుందా? అతడు మన స్కూల్ క్రికెట్ టీమ్‌కి కెప్టెన్‌గా ఉండేవాడు.)
Shanmukh: Yea. I do. He made a mess of his life, running after a career in movies.
(అవును. గుర్తున్నాడు. సినిమాల్లో చేరాలనే తపనతో జీవితం పాడు చేసుకున్నాడు.)
 

b) The Government has made a mess of Engineering and Medicine admissions this year. (ప్రభుత్వం ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల వ్యవహారంలో మొత్తం గందరగోళం సృష్టించింది.) 
Make a mess of = In a mess
= అంతా పాడైన/ గందరగోళ స్థితిలో/ అయోమయంలో ఉండటం.        
Professional course admissions this year is in a mess = ఈ ఏడాది వృత్తి విద్యాకోర్సుల ప్రవేశాలన్నీ గందరగోళ స్థితిలో ఉన్నాయి. (ప్రభుత్వం పాడు చేసింది.) 
Mess = కంగాళీగా/అసహ్యంగా/ గందరగోళంగా ఉండటం          
The kitchen is in a big mess. Let me clean it up   (వంటగది అంతా గందరగోళంగా ఉంది. శుభ్రం చేయాలి.) 
2. TO COME/ be in somebody's way = Obstructing = అడ్డంగా ఉండటం/ అడ్డుపడటం.
 a) Ayush: Why are you so much against my contesting the elections?          (నేను ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నువ్వెందుకు అంత వ్యతిరేకిస్తున్నావు?)
Sravan: Who is in your way? Go ahead. Contest and be left a broke.(నిన్నెవరు అడ్డగిస్తున్నారు? కానీ, పోటీ చేసి దివాలా తీయి. - Broke = దివాలా)
 b) India cannot have peace along its borders. Pakistan and China are in its way.(భారత సరిహద్దుల వెంబడి ప్రశాంతత ఉండటం లేదు. పాకిస్థాన్, చైనా అందుకు అడ్డుపడుతున్నాయి.)
c) Chinna: He is quite intelligent. Why isn't he able to get any job?
(అతడు తెలివిగలవాడేకదా. ఏ ఉద్యోగమూ ఎందుకు పొందలేకుండా ఉన్నాడు?)
 Seenu: His laziness is in the way.(అతడి బద్దకం అడ్డుపడుతోంది.) 
3. Look forward to: Wait eagerly for a good thing/ happening.(జరగబోయే మంచి కోసం ఆత్రుతతో ఎదురు చూడటం.) 
a) Asrai: How did you do in the interview yesterday?(నిన్న ఇంటర్వ్యూలో ఎలా చేశావు?) 
Akash: Well enough to be selected. I am looking forward to the appointment order.(ఎంపికయ్యేంత బాగా చేశాను. అపాయింట్‌మెంట్ లెటర్ కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నా.)
b) Prasanth: What are your ideas about your future?(భవిష్యత్ గురించి నీ ఆలోచనలేంటి?)
 Subhash: I am looking forward to getting my pilot's licence and flying a plane.(నా పైలట్ లైసెన్స్ కోసం, Plane ను నడపడానికి ఉవ్విళ్లూరుతున్నాను.)
          Look forward to is always followed by a noun/ ...ing form.          
We are looking forward to the release of our favourite hero's movie.          (మా అభిమాన నటుడి చిత్రం విడుదల కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నాం.)          

Look forward to the release (noun)          
We are looking forward to seeing the movie.          
Look forward to + '....ing' form. 

4. Be itching to do something/ be itching for something = Desiring strongly to do something.(ఏదైనా చేయాలనే బలమైన కోరిక.)
 a) Bhaskar: You know Omkar has been badly injured?(నీకు తెలుసా, ఓంకార్‌కు చాలా బలమైన గాయాలయ్యాయి.) 
Sekhar: I know. He had been itching to drive a car even before he could drive well, and it's not surprising he got injured.(తెలుసు. పూర్తిగా డ్రైవింగ్ నేర్చుకోకుండానే, నడపాలనే బలమైన కోరిక అతడిది. అందుకనే గాయాలు. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు.) 
b) Prasanna: Our classmate Dr. Ram has set up practice in town.(మనక్లాస్‌మేట్ డాక్టర్ రామ్ తన ప్రాక్టీస్‌ను సిటీలో ప్రారంభించాడు.) 
Susanth: I know, and I know as well he is itching to do his first operation.(నాకు తెలుసు. ఇంకా మొదటి ఆపరేషన్ ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఉబలాటపడుతున్నాడు.)
Itch = దురద.
To be itching = దురదగా ఉండటం - ఉబలాటపడటం.

 c) They are itching to play their first game.
(వాళ్లు మొదటి ఆట ఆడాలని ఉబలాటపతున్నారు.)
 

5. Beyond somebody's means = More than somebody can afford
     = ఒకరి తాహతుకు మించిన.
a) Ananth: I saw Sri Ram driving. Looks like he has bought one.
(శ్రీరామ్ కారు నడపటం నేను చూశాను. కారు కొన్నట్లున్నాడు.)
Basha: How can that be? A car is beyond his means at this stage.

(అదెలా సాధ్యం? ప్రస్తుత పరిస్థితుల్లో కారు అతడి తాహతుకు మించిన విషయం.)
 

b) Anup: Sumanth's father has sold off his house and is searching for a rented place.(సుమంత్ వాళ్ల నాన్న తన ఇంటిని అమ్మేసి అద్దె ఇంటికోసం వెతుకుతున్నాడు.)
Pattabhi: That is what comes from living beyond your means. He had borrowed huge sums of money that his style of life demanded.  


Upto his neck in debts, he was forced to sell off his house. The worse is yet to come.(మన తాహతుకు మించి జీవిస్తే అదే జరుగుతుంది. ఆయన జీవనశైలికి చాలా డబ్బు కావలసి వచ్చింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి, బలవంతాన ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. దీంతో అయిపోలేదు. ఇంతకంటే చెడు ఇంకా జరగనుంది.)         
Beyond somebody's means (ఒకరి తాహతుకు మించిన) 
× Within one's means (ఒకరి తాహతుకు లోబడి).        
Living within your means keeps you happy and ensures peace of mind = మన తాహతుకు తగిన విధంగా బతకడం (సంతోషంగా, మనశ్శాంతితో). 
It is beyond my means = It is not within my means     = నా తాహతుకు మించింది/ నా తాహతుకు లోబడిలేదు. 
ఇది కూడా నేర్చుకుందాం:
       
Upto one's neck = Be deeply involved in a) some work b) trouble (పీకల్లోతు మునిగి ఉండటం - తీరికలేని పనివల్ల గానీ, కష్టాలు, అప్పుల్లోగానీ.)
 a) Sorry, I can't come with you to a movie. I am up to my neck with this work.(క్షమించు. నేను సినిమాకు రాలేను. పీకల్లోతు పనిలో మునిగిపోయి ఉన్నాను.) 
b) He is upto his neck in the 2G scam.(అతడు 2G కుంభకోణంలో పీకల్లోతు మునిగి ఉన్నాడు.)