COLLOCATIONS - 10

COLLOCATIONS - 10

Abhiram: Hi Aparna, Have you submitted the report about the dispute?  You were asked to go into the entire matter and come out with the report, I understand.(నువ్వా వివాదాన్ని గురించిన report ను సమర్పించావా? ఆ మొత్తం వ్యవహారం విచారణ చేసి దానిపై నివేదిక ఇవ్వాల్సిందిగా నిన్నడిగారని నాకు తెలిసింది).
Aparna: It's not such a simple affair as for me to submit the report in a matter of a few days. I have yet to study how the dispute arose, and what the grounds for the complaint are against one of the parties. (ఏదో కొద్ది రోజుల్లో పూర్తి చేయగల్గేంత సులభమైన విషయం కాదది. ఆ వివాదం ఎలా తలెత్తిందీ, వాళ్లల్లో ఒకరి మీద ఇంకొకరు ఫిర్యాదు చేయాల్సిన కారణాలేంటో ఇంకా పరిశీలించలేదు నేను)
Abhiram: I think both of them had been getting on well till the in-laws of one of the parties sowed the seeds of suspicion in one of them about the other. (వార్తల్లో ఒకరి భార్య తరఫు చుట్టాలు అతనిలో అనుమాన బీజాలు నాటేంతవరకు, వాళ్లిద్దరూ అన్యోన్యంగా ఉండేవాళ్లనుకుంటా)
Aparna: undoubtedly. The mother-in-law fanned the feelings of dislike in one of them. The dispute has now reached a point of no return. (సందేహం లేదు. అత్తగారు అతనిలోని అయిష్టతను మరింత తీవ్రం చేసింది. ఆ వివాదం ఇప్పుడు మలుపు తిరగని స్థితికి చేరుకుంది.)
Abhiram: I wanted to talk to one of them about it and hammer out a compromise when I saw him on the road the other day. But the traffic was so dense that I could not do it. Stopping his speeding vehicle in such a heavy traffic could have resulted in an accident. (వాళ్లల్లో ఒకర్ని నేను మొన్న రోడ్లో వెళ్తుంటే చూశాను, అతనితో మాట్లాడి ఏదో రాజీ కుదుర్చుదామనుకున్నాను. కానీ రోడ్డు బాగా రద్దీగా ఉండటంతో అతడ్ని ఆపలేకపోయా. చాలా వేగంతో వాహనం మీద వెళ్తున్న అతన్ని నేను ఆపి ఉంటే ప్రమాదం జరిగుండేది.)
Aparna: That was sound thinking, of course. Anyway, your talking wouldn't have made any difference. They are now beyond any reconciliation. (చాలా చక్కగా ఆలోచించావు. అయినా కూడా అదేం పెద్ద ఫలితాన్నిచ్చేది కాదు. వాళ్లు రాజీపడే పరిస్థితిలో లేరు)
Abhiram: That makes your job all the more difficult. So go ahead and submit thereport. (అందువల్ల నీ పని బాగా కష్టమయింది. కాబట్టి నీ నివేదికను సిద్ధంచేసి సమర్పించు)
Aparna: I am at it  (ఆ పని మీదే ఉన్నా).
ఇవీ వ్యక్తీకరణలు
Look at the following expressions from the conversation...
1) Submit the report about the dispute.
2) I am yet to study how the dispute arose
3) ... What the grounds for the complaint are
4) ... till the in-laws of one of the parties sowed the seeds of suspicion
5) The traffic was so dense

1) Submit a report- submit: పత్రాల లాంటివి, ముఖ్యంగా applications, reports లాంటివి, పై అధికారులకు సమర్పించటం, వాళ్లు దాన్ని చదివి ఆమోదించేందుకు లేదా, తిరస్కరించేందుకు వాడతారు. 
Submit- చాలా వాటితో collocate అవుతుంది.
a) Submit an application. దరఖాస్తును పూర్తి చేసి సంబంధిత అధికారులకు పంపడం.
Kumar: When are we to send in the application?Kusuma: All applications have to be submitted by the 30th of this month.
b) The Sri Krishna Committee on the formation of Telangana submitted its report within 9 months = తెలంగాణా ఏర్పాటు పై వేసిన శ్రీకృష్ణ కమిటీ తన report ను తొమ్మిది నెలల్లో సమర్పించింది.
2) How the dispute arose: Dispute - argument because of a disagreement between two persons, two groups, two nations, etc = వివాదం.వివాదం తలెత్తడం - తెలుగులో 'వివాదం' 'తలెత్తడం'తో collocate అయ్యేట్లే, English లో dispute (వివాదం) arise (తలెత్తటం) తో collocate అవుతుంది.
Disputes (వివాదాలు) చాలా రకాలుగా ఉంటాయి కదా? 
Border dispute = సరిహద్దు వివాదం, 
As between India and China, and between India and Pakistan.
River water dispute = నదీజలాల వివాదంa) 
Spandana: why did the brothers come to blows (ఎందుకా అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు.)
Chandana: Because of a dispute that has arisen over a piece of land. (ఏదో భూవివాదం తలెత్తిన కారణంగా)
b) Disputes arise usually because of property = ఆస్తి కారణంగానే వివాదాలు తలెత్తుతాయి. 
వివాదం పరిష్కారమవడం = Settlement of a dispute
c) There appears no sign of any settlement of the dispute= వివాదం తీర్మానం/ పరిష్కారం అయ్యే సూచనలేవి కనబడటం లేదు.
3) Grounds for complaint = ఫిర్యాదులకు ఆధారం
a) Pranav: I don't know why he is always complaining. (వాడెందుకు ఎప్పుడూ ఫిర్యాదులు చేస్తుంటాడో నాకర్థంకాదు)
Pramod: Nor do I. As far as I can see, he has no grounds for complaint. (నాకూ తెలీదు. నాకు తెలిసినంతమటుకు అతడి అసంతృప్తికి కారణాలు లేవు)
b) Sankar: He is disappointed (అతను నిరాశ పడ్డాడు)
Santan: He has grounds. The court has dismissed his petition though it was just = (అందుకు కారణం ఉంది. అతడి వ్యాజ్యం న్యాయమైందే అయినా కోర్టు దాన్ని కొట్టేసింది)
4) Sow the seeds of suspicion: 'Sow' అంటే తెలుసు కదా = విత్తులు (seeds) నాటడం. 
Suspicion = అనుమానం.
Sow the seeds of suspicion = అనుమానబీజాలు నాటడం. ఒకరిలో అనుమానం కల్గించడం.
a) The Villains in Telugu movies often sow the seeds of suspicion in the hero about the heroine= తెలుగు సినిమాల్లో విలన్లు హీరోల్లో హీరోయిన్‌ను గురించి అనుమాన బీజాలు నాటుతారు.
b) Susmitha: Whatever you might say, I am not so sure of the success of our plan. (నువ్వేమన్నా చెప్పు, మన పథకం పారుతుందనే నమ్మకంలేదు నాకు.)
Subodh: Now I know. All this is because of the seeds of doubt Sarala has sown inyou. (నాకిప్పుడర్థమౌతోంది. ఇదంతా సరళ నీలో నాటిన సందేహాలవల్ల)
5) The traffic was so dense: రాకపోకలు బాగా రద్దీగా ఉండటం
a) The traffic is very dense in Ameerpet during the evening = సాయంత్రాల్లో అమీర్‌పేటలో రాకపోకలు బాగా రద్దీగా ఉంటాయి.)
b) In such dense traffic accident can be frequent. (అలాంటి రద్దీలో ప్రమాదాలు తరచూగానే ఉంటాయి.)
Traffic తో collocate అయే ఇంకోపదం - Heavy.
Heavy traffic = Dense traffic
Dense = దట్టమైన - ద్రవపదార్థాలు, వాయుపదార్థాలు, చిక్కనైన.
Dense curd = చిక్కటి పెరుగు
Dense fog = దట్టమైన పొగమంచు.