COLLOCATIONS - 9

COLLOCATIONS - 9

Deliver, hold పదాలతో వచ్చే collocations మీకు తెలుసా? వీటి గురించి ఉదాహరణలతో నేర్చుకుని బాగా practice చేద్దాం.
Surendra: Did you hear the lecture Mithun delivered yesterday on labour relations? It was wonderful. He appeared to have good solutions to management- worker conflicts. (కార్మిక సంబంధాలపై మిథున్ ఇచ్చిన ఉపన్యాసం విన్నావా? నిజంగా చాలా బాగుంది. యాజమాన్యం- శ్రామికుల సంఘర్షణలకు అతడి దగ్గర మంచి పరిష్కారాలున్నాయి).
Anand: He is an authority on the subject. However, not always is he correct. No one, 
for that matter, is. Only last year the workers in his 
factory went on a strike and staged dharnas too. (ఆ విషయం మీద అతడు నిష్ణాతుడు. అయితే అతడు అన్నివేళలా సరి అని చెప్పలేం. ఆ విషయానికొస్తే ఎవరూ కూడా పూర్తిగా సరైనవారు అవరు కూడా. క్రితం సంవత్సరమే అతడి కర్మాగారంలో పనివాళ్లు సమ్మె చేశారు, ధర్నా చేశారు.)
Surendra: Even then, remember, management relations with workers are better in his company than in most others. He is chiefly responsible for that. Having held the post of HRD manager for a 
number of years, he is well versed with labour matters.
(అయినప్పటికీ, గుర్తుంచుకో. చాలా ఇతర కంపెనీల్లో కంటే అతడి కంపెనీలో యాజమాన్య కార్మిక సంబంధాలు చాలా మెరుగ్గా ఉంటాయి. దానికి ముఖ్యకారణం అతడే. మానవ వనరుల అభివృద్ధి managerగా చాలాకాలం పదవి నిర్వహించడంలో కార్మిక విషయాలపై మంచి అవగాహన ఉంది.)
Anand: You know he is a HRD manager with a difference. He doesn't get stuck with old policies. 
He is quite innovative. (HRD Manager గా అతడికీ ఇతరులకీ చాలా తేడా ఉంది. పాత పద్ధతుల్లో ఉండడు. కొత్తకొత్త ఆలోచనలు చేస్తుంటాడు).
Surendra: OK. How about having his guest lecture one of these days? If we want to, we should 
inform him of it much in advance. He is very busy. (సరే. ఎప్పుడయినా అతడి ఉపన్యాసం పెట్టుకుందామా మనం? అలా అనుకుంటే చాలా ముందు చెప్పాలి మనం. అతడికి తీరిక ఉండదు).
Anand: Why not? I'll get in touch with him 
immediately and see that it is done. (తప్పకుండా, అతడిని వెంటనే పట్టుకుని అది జరిగేలా చూస్తా).

Notes:
1. Conflict = disagreement = సంఘర్షణ.
2. Authority = (ఇక్కడ) ఒక విషయం బాగా తెల్సినవారు
 (A person who knows a subject very well.. ఎంత బాగా అంటే, ఆ విషయంలో వాళ్లు చెప్పినదానికి తిరుగుండదు. The dictionary 
is an authority on meanings).
3. Innovative = getting new ideas and thinking 
in new ways నూతన విధానాలు ఆలోచించడం.

Look at the following expressions from the conversation above.
1) ... the lecture Mithun delivered.
2) Having held the post of HRD manager 
for a number of years
1) Deliver - 
ఇది verb. అర్థం- ఒక చోటికి వస్తువులను/మనుషులను చేర్చడం. ఈ మాటతో చాలా మాటలు collocate అవుతాయి. ఇది సర్వసాధారణంగా వాడే మాట. 

పై సంభాషణలోని expressions నే తీసుకుందాం.
Deliver a lecture = ఉపన్యాసం ఇవ్వటం.
a) Sunanda: Where are you going 
Suneetha?
Suneetha: Baba Yogananda is delivering a lecture at the local auditorium. I want to attend it. (Do you) want to 
come? (బాబా యోగానంద స్థానిక auditoriumలో ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. అక్కడికి వెళ్ళాలనుకుంటున్నా. నువ్వూ వస్తావా?)
Surendra: Sorry. I have no patience 
for such things. (నాకంత ఓపిక లేదులే)

Deliver a speech అని కూడా అంటాం.
Deliver a speech / a lecture = ఉపన్యాసాల్లాంటివి ఇవ్వడం.
b) The speech he delivered on the future of India held the audience spell 
bound = అతడిచ్చిన ఉపన్యాసం శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది.

Hold audience spell bound = శ్రోతలను మంత్రముగ్ధులను చేయడం. 
ఇక్కడ spell = మంత్రం. 
bound = P.T. of bind = కట్టిపడేయడం.
Deliverతో collocate అయ్యే ఇతర పదాలు:
Deliver a letter/a message = ఉత్తరాలను/ సందేశాలను చేర్చడం.
c) Prabhat: How did you get the 
message? (నీకా వార్త ఎలా అందింది?)
Prasad: Suman delivered the message 
to me over phone (సుమన్ నిన్న నాకు ఆ వార్త ఫోన్లో అందించాడు.)

2) Deliver goods = వస్తువులు చేరవేయడం. అయితే deliver the goods కు idiomaticగా వేరే అర్థం ఉంది. చెప్పినవిధంగా పని పూర్తిచేయడం అని.
a) I am not sure that the UPA govt. elected with such a massive majority 
will deliver the goods = గొప్ప మెజారిటీతో ఎన్నికైన UPA ప్రభుత్వం తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందనే నమ్మకం నాకు లేదు.
b) The company's performance shows 
that it can deliver the goods = ఆ కంపెనీ పనితీరు చూస్తే తన మాటను నిలబెట్టుకుంటుందనే అన్పిస్తోంది.

3) ''deliver' తో collocate అయ్యే మాటల్లో మరొకటి judgment/verdict (తీర్పు)
a) People are satisfied with the judgment 
the court has delivered.
b) The judge delivered a verdict of not 
guilty in the case = ఆ కేసులో ముద్దాయి నిరపరాధి అని జడ్జి తీర్పిచ్చారు. 
(Verdict = తీర్పు; guilty = దోషి అయిన).
 విధంగా ఒక case లో కోర్టు తీర్పు ఇవ్వడాన్ని deliver the judgement/verdict అంటాం.
Go on a strike = సమ్మె చేయడం. (Do a 
strike అనడం సరికాదు)
a) Sumanth: What's all that noise? 
Why this traffic jam? (ఏంటా గొడవ? ఇలా వాహనాలన్నీ నిల్చిపోయాయేం?)
Srinath: The workers in the factory nearby are staging a strike and some are
staging a dharna. (దగ్గరున్న factory కార్మికులు సమ్మె చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు.)
staging a strike = సమ్మె చేయటం. be on a 
strike = సమ్మెలో ఉండటం.
b) The students are on a strike demanding the postponement of exams 
= పరీక్షల వాయిదా కోరుతూ విద్యార్థులు సమ్మెలో ఉన్నారు.

Stage a protest = నిరసన తెలపడం.
Stage a demonstration = నిరసన ప్రదర్శన చేయడం.
Stageతో collocate అయ్యే మాటలు.
stage a strike, stage a protest, stage a 
demonstration, stage a show (ప్రదర్శన నిర్వహించడం), stage a play (నాటకం వేయడం, play = నాటకం)

4)   Hold a post = ఒక ఉద్యోగం నిర్వహించడం.
a) Hi has been holding the post of the President of India for the 
past two years = అతడు అధ్యక్ష పదవిని నిర్వహిస్తున్నారు.
b) He no longer holds the post. He has 
resigned. = అతడు ఉద్యోగం చేయడం లేదు. రాజీనామా చేశాడు.
(post = job)