COLLOCATIONS - 6
Nandana: Here's your chance. Let it not slip.(ఇదిగో నీకొకవకాశం. వదులుకోకు)
Sumithra: What are you talking about? What chance am I likely to pass up?
(దేన్ని గురించి మాట్లాడుతున్నావు? నేను ఏ అవకాశాన్ని వదులుకున్నాను?)
Nandana: Here's an ad asking for trainers in spoken English. You have all the qualifications they're asking for. You've always had a gift for languages, especially English.(Spoken English శిక్షకులనాహ్వానిస్తూ ఇక్కడొక ప్రకటన ఉంది. వాళ్లు అడుగుతున్న అర్హతలన్నీ నీకున్నాయి. భాషలు సులభంగా నేర్చుకోగల/ సహజంగా వచ్చే వరం నీకుంది, ముఖ్యంగా English అది నీకిట్టే వచ్చేస్తుంది).
Sumithra: Oh, thank you. I've been looking exactly for such an opportunity. I have long wished to change my job. I'm unable to withstand the pressure of the work here.
(అలాంటి అవకాశం కోసమే చూస్తున్నాను నేను. చాలాకాలంగా నా ఉద్యోగం మార్చుకోవాలని కోరుకుంటున్నా. ఇప్పుడు నేను ఉన్నచోట ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నా).
Nandana: It's a walk-in interview. You still have a week's time. I think Suneela knows the people. She will definitely put in a word in your favour.(అది walk-in interview. ఇంకా నీకు వారం వ్యవధి ఉంది. సునీలకు వాళ్లు తెలుసనుకుంటా. తను నీకు అనుకూలంగా ఒక మాట చెప్పగలదు).
Sumithra: Oh, no. She's been down with flu and has been confined to home. She is away at her uncle's in Tamil Nadu where there was an outbreak of measles. I doubt if she can be here in time to help me. So that rules out her help for me.
(లేదు fluతో బాధపడుతోంది తను. ఇంటికే పరిమితమైంది. తమిళనాడులో వాళ్ల మామయ్య ఇంట్లో ఉంది. అక్కడేమో ఆటలమ్మ ప్రబలింది. ఈ సమయంలో ఇక్కడికి వచ్చి నాకు సహాయం చేయలేదు. కాబట్టి తను నాకు సాయం చేసే ప్రసక్తి లేదు).
Nandana: The job appears to be a challenging one. The pay is high, but the job is to train Telugu medium students from a rural background. That's really a tough challenge.
(ఈ ఉద్యోగం సవాలు విసిరేదిగా ఉంది. జీతం ఎక్కువే కానీ గ్రామీణ వాతావరణంలోని తెలుగు మీడియం విద్యార్థులకు Spoken English శిక్షణ. ఇది పెను సవాలు).
Sumithra: I am ready to face the challenge. What's life worth without challenges?
(నేనా సవాలెదుర్కోవడానికి సిద్ధం. సవాళ్లు లేని జీవితానికి విలువేముంది?)
ఈ వ్యక్తీకరణలు చూడండి...
1) Let a chance (an opportunity) slip/ slip through one's fingers/ pass up = అవకాశాన్ని జారవిడవటం/ చేజేతులా వదులుకోవడం/ వదులుకోవడం =
a) Here's a wonderful opportunity to prove your talent. Don't let it pass up/ slip = నీ ప్రతిభను ప్రదర్శించుకునేందుకు అద్భుతమైన అవకాశం వచ్చింది. వదులుకోకు.
Let it slip = let slip an opportunity
let slip (జారవిడవటం)తో collocate అయ్యే పదాలు: an opportunity/ chance/ the occasion.
b) When the CM was here, Ramesh could have spoken to him, but he let slip the opportunity/ chance = CM ఇక్కడ ఉన్నప్పుడు, రమేష్ ఆయనతో మాట్లాడి ఉండొచ్చు కదా? ఆ అవకాశాన్ని అతడు వదులుకున్నాడు.
c) Kumar: You appear down today (ఏంటి నిరుత్సాహంగా కనపడుతున్నావు?)Kiran: The boss was on leave today. I could have taken leave too. But I let slip the occasion.
(ఇవాళ boss leave లో ఉన్నాడు, నేనూ leave పెట్టి ఉండొచ్చు కదా? కానీ మంచి సందర్భాన్ని కోల్పోయా.)
వచ్చిన అవకాశాన్ని దొరకబుచ్చుకోవడం = grab an offer/ the opportunity
Let slip/ pass up a chance (opportunity) X grab a chance/ opportunity/ offer.
She had the opportunity and she grabbed it = ఆమెకు అవకాశం వచ్చింది. దాన్ని ఆమె వదలలేదు (గట్టిగా పట్టుకుంది)
2) Have a gift for something = సహజ సిద్ధంగా/ పుట్టుకతో మనకు అబ్బే గుణాలు.
a) Srisri had a gift for poetry / Poetry came naturally to him = ఆయనకు కవిత్వం సహజంగా అబ్బిన గుణం/ ప్రతిభ.
Have a gift for = be gifted with: Chitra has a gift for singing / she is gifted with a singing voice
3) Withstand = be able to bear = తట్టుకోవడం.
withstand, ఈ అర్థంతో చాలా పదాలతో collocate అవుతుంది.
a) withstand pressure= = ఒత్తిడి తట్టుకోవడం
b) withstand the heat of Vijayawada = విజయవాడ ఎండ వేడి తట్టుకోవడం
c) withstand somebody's presence = ఒకరు మన సమక్షంలో ఉండటం తట్టుకోవడం
d) withstand Telugu movies = తెలుగు సినిమాలను తట్టుకోవడం
* A mother can withstand any kind of trouble from her children = తన పిల్లల వల్ల కలిగే ఎంత బాధనయినా తల్లి తట్టుకోగలదు. మనకు బాధ కల్గించే ఏ విషయాన్ని తట్టుకోవడం అయినా, withstand వాడొచ్చు.
ఇంకా గమనించండి:
withstand = stand (stand ఎక్కువగా వాడే అర్థం- నిల్చోడం. కానీ భరించడం/ తట్టుకోవడం అనే అర్థంతో
stand = withstand
I can't stand his silly talk anymore = అతడి అర్థం లేని మాటలు నేనింక తట్టుకోలేను.
4) be confined = పరిమితమవడం (ఒక చోటికి)confined to home = ఇంటికే పరిమితమయి బయటికి వెళ్లలేకపోవడం;
confined to bed = మంచాన పడటం;
confined to hospital = ఆస్పత్రిలోనే ఉండటం;
confined to books= పుస్తకాలు చదువుతూ గడిపేయడం;
confined to bed = bedridden = జబ్బుతో కదల్లేక పోవడం.
ఇలా confined to కదలికలకు స్వేచ్ఛలేదని తెల్పేందుకు చాలా వాటితో collocate అవుతుంది, ఒక పరిమితికి లోబడి అనే అర్థంతో.
5) Outbreak: This is a very useful word = The sudden start of something, usually something bad = ఉన్నట్టుండి ఏదయినా మొదలవటం - ఏదైనా చెడు = (అంటువ్యాధుల్లాంటివి) ప్రబలడం; హింస/ దౌర్జన్యం లాంటివి చెలరేగటం.
a) 'Why is the crowd in front of the Health office? (Health office ముందు ఆ గుంపేంటి?)
There has been an outbreak of cholera and the department has done nothing about it.
(కలరా ప్రబలినా ఆరోగ్యశాఖ ఏ చర్యా తీస్కోనందుకు, వాళ్లు నిరసన తెలుపుతున్నారు)
b) The outbreak of dengue has already claimed ten lives = డెంగీ ప్రబలి పది ప్రాణాల్నిప్పటికే పొట్టన బెట్టుకుంది.
outbreak of violence = హింస చెలరేగటం:
Following the arrest of the naxalite, There was on outbreak of violence in the tribal area = ఓ నక్సలైటును అదుపులోకి తీస్కోవడంతో ఆ గిరిజన ప్రాంతంలో హింస చెలరేగింది.