COLLOCATIONS - 7

COLLOCATIONS - 7

చాలా తరచుగా వాడగలిగే కొన్ని మాటల కలయికల (collocations)ను చూద్దాం. ఇవి ముఖ్యంగా వ్యాధులకు సంబంధించినవి.
Aphia: (have you) heard of this? Vanitha's father is seriously ill and has been admitted into a hospital.
            (ఇది విన్నావా? వనిత వాళ్ల నాన్నకు జబ్బు తీవ్రంగా ఉంది. ఆస్పత్రిలో చేర్చారు.)

Bindu: I've known he has had chronic arthritis for some time, but that is not the critical type, is it?
             (ఆయనకు కీళ్లవాతం అని తెలుసు, కానీ అదంత ముంచుకొచ్చే ప్రమాదం కాదు కదా!)

Aphia: It is not arthritis now. He had an acute heart problem, and was rushedto hospital. The minute she heard the news over the phone, she burst into tears, and not in a position to decide what she had to do. I then put her in an auto and sent her to the hospital.
(ఇప్పుడిది కీళ్లవాతం కాదు. తీవ్రమైన హృద్రోగం వచ్చిందాయనకు, హడావిడిగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఫోన్లో ఆ మాట వినగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయింది, ఏం చేయాలో తోచలేదు. నేనే ఆటో మాట్లాడి ఆస్పత్రికి పంపాను.)

Bindu: Poor thing! This must have been a sudden complication then.
             (పాపం! ఇది అకస్మాత్తుగా వచ్చిన గడ్డు సమస్య అయి ఉండాలి.)

Aphia: It certainly is. Just this morning she got the news of her daughter'sselection for a bank job, that too SBI. Something beyond their expectations, and she was no end happy.
(కచ్చితంగా అదే. ఇవాళ పొద్దున్నే వాళ్లమ్మాయి బ్యాంక్ ఉద్యోగానికి ఎంపికైంది అనే వార్త విన్నది, అదీ State Bank కు. వాళ్లు ఇది వస్తుందని అనుకోలేదు, చాలా సంతోషపడింది.)

Bindu: And then she got this news, did she? What a pity! Are you going to the hospital now? Let me go with you then.
            (ఆ తర్వాత ఈ వార్త వచ్చింది కదా! ఎంత దురదృష్టం? నువ్వు ఆస్పత్రికి వెళుతున్నావా? నేనూ వస్తాను.)
Aphia: That requires seeking boss's permission for a few hours.
             (దానికి కొన్ని గంటలపాటు boss అనుమతి కావాలి.)

Bindu: Okay. I am going to her now. (సరే. ఆమె దగ్గరకు వెళ్లి అనుమతి తీసుకుంటా.)
Look at the following expressions from the conversation above:      
1) Vanitha's father is seriously ill      
2) ... he has had chronic arthritis      
3) He had an acute heart problem      
4) She burst into tears      
5) Something beyond their expectations
1) Seriously ill = వ్యాధి తీవ్రంగా ఉండటం/ చాలా ఆందోళనకర పరిస్థితి. 
Ill అంటే తెలుసు కదా! వ్యాధితో బాధపడటం. - 
He is ill and cannot move out = ఆయన జబ్బుతో ఉన్నారు, బయటికి కదలలేడు. 
అదే విషమం/ విపత్కర వ్యాధి అయితే He is ill and cannot move out అంటాం. కోలుకోవడం కొంచెం కష్టమే. 
'Ill' (జబ్బుతో ఉండటం)తో collocate అయే మరో పదం critically - 
critically ill - ఇది serious కంటే ఎక్కువ విషమం - ఏ క్షణంలోనైనా అనుకోనిది జరిగిపోవచ్చు.    
a) Kundan: Where is Pradhan now? (ప్రధాన్ ఇప్పుడెక్కడ ఉన్నాడు?)
      
Vasanth: He is in the emergency ward of Getwell Hospitals. He is seriously ill. The doctors can't say anything for 48 hours. (అతడు Getwell Hospitals అత్యవసర విభాగంలో ఉన్నాడు. ఆరోగ్యం విషమంగా ఉంది. 48 గంటల వరకూ ఏమీ చెప్పలేమంటున్నారు వైద్యులు)
     
Seriously ill = Critically ill = జబ్బు తీవ్రత ఎక్కువగా ఉండటం. ఇంకా critically ill అంటే, seriously ill కంటే ఎక్కువ తీవ్రత;
ఏ క్షణాన్నయినా ఏదైనా జరగవచ్చు.
    
b) Prabhat: Doctor, what are the chances? (డాక్టర్ గారూ, అవకాశాలెలా ఉన్నాయి?)
          
Doctor: The condition is still critical. (I) can't say anything now. (పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పుడేం చెప్పలేం). In fact when he was brought to hospital itself he was critically ill (అసలు ఆయనను ఆస్పత్రికి తీసుకువచ్చినప్పుడే చాలా విషమంగా ఉంది పరిస్థితి.)
      
Seriously/ critically ill  ×  Slightly ill (కొద్దిపాటి అనారోగ్యం)

2) Chronic arthritis - Chronic = దీర్ఘకాలంగా మొండిగా ఉండి, ప్రాణాపాయం వెంటనే కల్గించని వ్యాధులు
      
Arthritis = కీళ్లవాతం - దీర్ఘకాలం బాధించే మోకాళ్ల/మోచేయి నొప్పులు - వెంటనే ప్రాణాపాయం కల్గించని వ్యాధి
      
a) Prasanna: Doctor, how long more have I to suffer from this asthma? (నేను ఈ ఉబ్బసంతో ఇంకా ఎంతకాలం బాధపడాలి?)
             
Doctor: It's chronic you know. I am sorry there is no permanent cure for it. We can only give you some relief for the moment.
                           (అది దీర్ఘకాలిక వ్యాధి కదా! దానికి శాశ్వత నివారణ లేదని చెప్పేందుకు బాధపడ్తున్నాను. ఏదో తాత్కాలికంగా విముక్తి కల్గించగలం.)
      
b) Paralysis is no life taker. It's a chronic disease = పక్షవాతం ప్రాణహాని కల్గించే వ్యాధేం కాదు. అదొక మొండి/దీర్ఘకాలిక వ్యాధి.
       C
hronic × Critical/ acute

3) Acute = విపరీతమైన, వెంటనే వైద్యం చేయించాల్సిన అవసరాన్ని కల్పించే
      
a) Sajjan: What's your opinion, doctor? (మీ అభిప్రాయం ఏంటి డాక్టర్ గారూ?)
           
Doctor: The case is acute. Anytime from now it may turn critical. Put him up in the emergency ward.
                         (కాస్త తీవ్రంగానే ఉంది. ఏ క్షణాన్నయినా అది విషమించవచ్చు. మా అత్యవసర సేవల విభాగంలో ఉంచండి)
       
Acute (విపరీతమయిన) toothache/ heart trouble/ lung disorder/ appendicitis = విపరీతమైన/విషమించగల పంటినొప్పి/హృద్రోగం/ఊపిరితిత్తుల వ్యాధి/appendicitis. 

Acute - తీవ్రమయిన/విపరీతమయిన అనే అర్థంతో చాలావాటితో collocate అవుతుంది. 
Acute problem = తీవ్ర సమస్య 
Acute + water shortage = తీవ్ర నీటికొరత  
4) Burst into tears = ఉన్నట్టుండి ఏడుపు మొదలెట్టడం.
     
a) She burst into tears at the sight of her dead child
     
b) Burst into laughter = ఉన్నట్టుండి పగలబడినవ్వడం. 

Past tense and pastparticiple of 'burst' - 'burst' only.
     
a) They burst into laughter on hearing his joke = joke వినగానే అక్కడందరూ పగలబడి నవ్వారు.
     
b) Heroes and heroines in Indian movies burst into song at every opportunity = అవకాశం వచ్చిందంటే చాలు, భారతీయ చలనచిత్రాల్లో కథా నాయకులు, నాయికలూ పాట మొదలు పెడతారు. (They burst into duets అని కూడా అనవచ్చు)

5) Beyond somebody's expectations = ఆశించినదానికి అతీతమైన.
     
a) Chandan: You appear to be aiming at a ministership (ఏదో మంత్రి పదవిని లక్ష్యంగా చేసుకున్నట్టున్నావు!)
          
Nandan: Me, a Minister! Becoming an MLA is itself beyond my expectations. How can I think of a ministership?
                           
(నేనా? మంత్రా? MLA అవడమే నేనాశించలేనిది/నా ఆశలకతీతమైంది; మంత్రయ్యే ఆలోచన నాకెందుకుంటుంది?)
    
b) A corruption free India! That's beyond anybody's expectation (అవినీతి రహిత భారతదేశమా! అది మనం ఆశించలేనిది.)